Begin typing your search above and press return to search.

బ్యాంక్ ఖాతాలపై ఆర్ బీఐ కొత్త కండీషన్

By:  Tupaki Desk   |   16 Dec 2016 8:19 AM GMT
బ్యాంక్ ఖాతాలపై ఆర్ బీఐ కొత్త కండీషన్
X
మీకు బ్యాంక్ ఖాతా ఉందా? దానికి పాన్ నెంబరుతో అనుసంధానం చేసి లేదా? అయితే.. ఈ వార్త కచ్చితంగా మీరు చదవాల్సిందే. బ్యాంకు ఖాతా ఉండి.. ఆ ఖాతాలో మీ పాన్ నెంబరును నమోదు చేయని వారిపై ఆర్ బీఐ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. పెద్దనోట్లను రద్దు చేసిన వేళ.. పాతనోట్లను పెద్ద ఎత్తున పక్కదారి పట్టించేలా ప్రతిఒక్కరూ పలు ఖాతాలతో మాయ చేస్తున్న వైనాన్ని గుర్తించిన ఆర్ బీఐ తాజాగా కీలక నిర్ణయాన్ని తీసుకుంది. దీని ప్రకారం.. నవంబరు 9 తర్వాత ఎవరైనా రూ.2లక్షలకు మించిన మొత్తాన్ని బ్యాంకులో డిపాజిట్ చేస్తే.. ఆ ఖాతాను వారి పాన్ నెంబరుతో అనుసంధానం చేయాలని కోరింది.

ఒకవేళ.. పాన్ నెంబరుతో ఖాతాను కానీ అనుసంధానం చేయకుంటే.. ఆ ఖాతాను ఆపరేట్ చేయకుండా పరిమితులు విధించింది. పాన్ కార్డు లేకుంటే.. ఫారం 60ని నింపి బ్యాంకుకు సమర్పించాలని కోరింది. అంతేకాదు.. నవంబరు 9 ముందు.. రూ.5లక్షలకు పైగా డిపాజిట్లు చేసిన ఖాతాదారులుసైతం తమ పాన్ నెంబరుతో బ్యాంకు ఖాతాను తప్పనిసరిగా అనుసంధానం చేయాలని పేర్కొంది.

పాన్ నెంబరును అనుసంధానం చేయకుండా.. వీలైనన్నిబ్యాంకు ఖాతాల్ని తెరిచి.. పెద్దనోట్ల రద్దు తర్వాత విధించిన పరిమితికి లోబడి ఒక్కో ఖాతాలో పెద్ద ఎత్తున మొత్తాన్ని డిపాజిట్ చేస్తున్న నేపథ్యంలో.. పాన్ కార్డుతో బ్యాంకు ఖతాల్ని అనుసంధానం చేయటం ద్వారా.. ఒక వ్యక్తికి ఎన్ని బ్యాంకు ఖాతాలు ఉన్నాయి? వాటిల్లో ఎంత మొత్తాన్ని డిపాజిట్ చేశారన్న విషయాన్ని గుర్తించే వీలు ఉంటుంది. ఇటీవల ఒక బిజినెస్ మ్యాన్ కు 85 బ్యాంకు ఖాతాలు ఉన్న విషయం బయటకు రావటంతో.. ఆర్ బీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు.బ్యాంకు ఖాతాలు ఉన్న వారు.. తమ పాన్ కార్డు నెంబరుతో అనుసంధానం చేయాల్సిన అవసరం ఉంటుంది. లేని పక్షంలో బ్యాంక్ ఖాతా లావాదేవీల్ని నిలిపివేసే ప్రమాదం పొంచి ఉన్నట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/