Begin typing your search above and press return to search.
అంధులు కరెన్సీ ని గుర్తించేందుకు RBI కొత్త యాప్ !
By: Tupaki Desk | 2 Jan 2020 6:40 AM GMTకంటి చూపు సరిగా లేని వారి కోసం కరెన్సీ నోట్లను గుర్తించేందుకు వీలుగా ఆర్బీఐ సరికొత్త సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ని నూతన సంవత్సరం రోజు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ ‘ఎంఏఎన్ ఐ' (మనీ) పేరుతో ఈ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా కంటి చూపు సరిగా లేని వారు సైతం కరెన్సీ నోట్లను గుర్తించవచ్చు. ఈ సందర్భంగా అధికారులు యాప్ కి సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించారు.
కంటిచూపు సరిగాలేని వారు సులువుగా నోట్లను గుర్తించేలా ఈ యాప్ ను తయారు చేశామన్నారు. ఆండ్రాయిడ్, ఐ ఫోన్ యూజర్లు ఈ యాప్ ను ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. ఐవోఎస్ ఆపిల్ ప్లే స్టోర్, గూగుల్ ప్లే స్టోర్ వంటి వాటి నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దీనిని ఒకసారి ఇన్ స్టాల్ చేసుకుంటే, ఆ తర్వాత అది ఆఫ్ లైన్ లో కూడా పనిచేస్తుందని తెలిపారు. రెండు సులభమైన స్టెప్పులలో కరెన్సీని గుర్తించవచ్చు.
ఈ యాప్ ఫోన్ కెమెరా సాయం తో కరెన్సీ నోట్ల ను స్కాన్ చేసి హిందీ లేదా ఇంగ్లీష్ భాషల్లో సమాధానం ఇస్తుంది. భారత కరెన్సీకి అనేక ఫీచర్లు ఉంటాయని, అంధులు కూడా నోట్ల ను సులభం గా గుర్తించే విధంగా ఈ యాప్ రూపొందించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ చెప్పారు. ఆర్బీఐ మహాత్మాగాంధీ సిరీస్ పేరుతో సైజులు, డిజైన్ల లో మార్పులు చేసి 2016 నవంబర్ నెలలో కొత్త కరెన్సీ నోట్లను అందరికి అందుబాటులోకి తీసుకువచ్చింది. అందులో భాగంగా రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 నోట్లను విడుదల చేసింది. ఈ కొత్త నోట్లను గుర్తించేందుకు అంధులకు ఇబ్బంది గా మారిందనే వాదనలు వినిపిస్తున్న తరుణంలో RBI ఈ కొత్త యాప్ అంధుల కోసం విడుదల చేసింది.