Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాల బ్యాంకర్లకు ఆర్ బీఐ నోటీసులు
By: Tupaki Desk | 18 Dec 2016 4:54 AM GMTపెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఆర్ బీఐకి భారీ ఎత్తున ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది. రెండు రాష్ట్రాల్లోని బ్యాంకర్లు వ్యవహరిస్తున్న తీరుపై ఈ మొయిళ్లు.. ఉత్తరాలతో ఆర్ బీఐకి ఫిర్యాదుల వరద పాటించినట్లుగా చెబుతున్నారు. పెద్దనోట్లను రద్దు చేసిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో నోట్లు దొరక్క ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నిఇన్ని కావు. గంటల కొద్దీ క్యూలైన్లలో నిలుచున్నా.. నగదు దొరకని దుస్థితి. అదే సమయంలో.. బ్యాంకు సిబ్బంది కమిషన్ కక్కుర్తితో పెద్ద ఎత్తున మొత్తాల్ని అక్రమంగా మళ్లించినట్లుగా ఫిర్యాదులు పోటెత్తుతున్నాయి. దీంతో.. బ్యాంకర్ల వ్యవహారాలపై లక్షలాది ఫిర్యాదులు ఆర్ బీఐకి అందాయి.
దీంతో స్పందించిన ఆర్ బీఐ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకర్లకు నోటీసుల్ని జారీ చేసింది. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత బ్యాంకర్లు తమ కార్యాలయ సీసీ కెమెరా ఫుటేజ్ ను తమకు పంపాల్సిందిగా కోరింది. ఉదయం 10 గంటల నుంచి సాయత్రం ఐదు గంటల వరకు తీసిన వీడియో ఫుటేజ్ ను తమకు పంపాల్సిందిగా ఆదేశించింది. డిసెంబరు 30 వరకూ ఈ ఫుటేజ్ ను పంపాలని కోరటంతో బ్యాంకర్లకు నోట మాట రావటం లేదంటున్నారు.
ఆర్ బీఐ తాజా ఆదేశాలతో పలువురు బ్యాంకర్ల గుట్టురట్టుకావటంతో పాటు.. వారు చేసిన దందాలు..కమిషన్ కక్కుర్తితో చేసిన వెధవ పనులన్నీ బయటకు రావటం ఖాయమన్నమాట వినిపిస్తోంది. ఇదిలాఉంటే.. ఆర్ బీఐ తీసుకున్న తాజా నిర్ణయంతో బ్యాంకర్లకు శరాఘాతం లాంటిదని చెబుతున్నారు. ఇప్పటికే సిబ్బంది కొరతతో విలవిలలాడుతున్న బ్యాంకర్లు.. ఇప్పుడు సీడీలు తీసి.. వాటిని ఆర్ బీఐకి పంపటం తలకు మించిన భారంగా వాపోతున్నారు. అయితే.. ఆర్ బీఐ జారీ చేసిన ఆదేశాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకర్లు జాగ్రత్తగా పని చేసేవీలుందని చెబుతున్నారు. సీసీ కెమేరా ఫుటేజ్ నుకానీ ఆర్ బీఐకి పంపిన పక్షంలో.. పలువురు మేనేజర్లకు మహా ఇబ్బందిగా మారటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/