Begin typing your search above and press return to search.

పెద్ద‌నోట్ల‌ను కాల్చేస్తారా?చించేస్తారా?

By:  Tupaki Desk   |   18 Nov 2016 3:41 AM GMT
పెద్ద‌నోట్ల‌ను కాల్చేస్తారా?చించేస్తారా?
X
రూ.500 - రూ. 1000 నోట్ల ర‌ద్దు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. భార‌తదేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను స‌మూలంగా మార్చివేయగ‌ల స‌త్తా ఉన్న ఈ నిర్ణయంతో చ‌లామ‌ణిలో ఉన్న 85 శాతం పాత ఐదొంద‌లు - వెయ్యి రూపాయ‌ల నోట్లు ర‌ద్ద‌యిపోతాయి. కేంద్ర ప్ర‌భుత్వం లెక్క‌ల ప్ర‌కార‌మే ఇప్ప‌టికీ పాత నోట్లు బ్యాంకులు - పోస్టాఫీసుల్లో జ‌మ‌యింది భారీ మొత్తంలో ఉంది. అయితే ఇంత‌కీ ఈ పాత‌నోట్ల‌ను ఏం చేయ‌నున్నారు? ఈ సందేహం స‌ర్వత్రా నెల‌కొన్న క్ర‌మంలో మీడియా వ‌ర్గాల‌కు ప‌లువురు ఆర్బీఐ మాజీ ఉద్యోగులు ఆస‌క్తిక‌ర స‌మాచారం ఇచ్చారు.

సాధారణంగా నోట్ల ఉప‌సంహ‌ర‌ణ జ‌రిగిన స‌మ‌యంలో వాటిని కాల్చేస్తారని వారు పేర్కొంటున్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాటిని ముక్కలు ముక్కలుగా చించేస్తారని అంచ‌నా వేస్తున్నారు. అయితే ప్ర‌స్తుతం పెద్ద ఎత్తున వ‌చ్చిప‌డుతున్న రూ.500 - రూ.1000 నోట్ల‌ను కాల్చేయాలా - ఏం చేయాలన్న విషయాన్ని రిజర్వుబ్యాంకే నిర్ణయించాలని అంటున్నారు.

ఇదిలాఉండ‌గా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రధాని మోదీ ప్రకటించిన రోజున లక్షల సంఖ్యలో ప్రజలు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు కానీ ఆ నిర్ణయం సామాన్య జనజీవనం - ఆర్థికవ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుండటంతో వారే తమ అభిప్రాయాలను మార్చుకుంటున్నారని అంటున్నారు. ప్రధాని నిర్ణయం దీర్ఘకాలంలో సానుకూల ఫలితాలను ఇవ్వనున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఆరు నెలల పాటు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉందని ఆర్థికవేత్తలు విశ్లేషిస్తున్నారు. ఇదిలాఉండ‌గా ప్రధాని నిర్ణయానికి మొట్టమొదట బలైంది రియల్ ఎస్టేట్ రంగం. షేర్ మార్కెట్లూ ప్రభావితమయ్యాయి. ఆటొమొబైల్ - సిమెంట్ - హౌసింగ్ ఫైనాన్స్ కూడా త్వరలో ప్రభావితం కానున్నాయని విశ్లేష‌కుల మాట‌!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/