Begin typing your search above and press return to search.
దసరాకు అందరి పర్సుల్లో రూ.200 నోటు!
By: Tupaki Desk | 14 July 2017 5:51 AM GMTకొత్త నోటు రానుంది. సుమారు ఏడెనిమిది నెలల ముందు సరికొత్తగా వచ్చింది రూ.2వేల నోటు. ఇప్పుడు మళ్లీ మరో కొత్త నోటు అందరి పర్సుల్లోకి రానుంది. ఇప్పటివరకూ లేని డినామినేషన్ అయిన రూ.200 నోటును తీసుకొచ్చేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోవటం.. అందుకు తగ్గట్లే ఆర్ బీఐ ఏర్పాట్లు చేయటం తెలిసిందే.
ఇప్పటికే ప్రింటింగ్ షురూ అయిన రూ.200 నోటు చెలామణిలోకి ఎప్పడు వస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆర్ బీఐ వర్గాల సమాచారం ప్రకారం ఈ కొత్త నోటు ప్రింటింగ్‌ను ఇప్పటికే మొదలు పెట్టేశారు. అనుకున్న ముద్రణ లక్ష్యానికి చేరుకోవటానికి మరికొంత కాలం పడుతుందని చెబుతున్నారు.
అనుకున్న విధంగా ముద్రణ పూర్తి అయ్యాక దేశ వ్యాప్తంగా ఒకేసారి కొత్త నోట్లను రిలీజ్ చేయనున్నట్లుగా చెబుతున్నారు. దాదాపుగా దసరా నాటికి కొత్త నోటు చెలామణిలోకి వస్తుందని చెబుతున్నారు. మొదట్లో ఆగస్టు 15 నాటికే బయటకు తీసుకురావాలని అనుకున్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.
పరిమిత సంఖ్యలో ఆగస్టు నాటికి తీసుకొచ్చినా.. అందరికి అందుబాటులోకి వచ్చే సరికి మాత్రం దసరా వరకూ పడుతుందని చెబుతున్నారు. మరో విషయం ఏమిటంటే.. ప్రారంభ దశలో రూ.200 నోటు ఎటీఎంలలో లభించదు. ఎందుకంటే.. ఎటీఎంలను రూ.200 నోటుకు సరిపడా వసతి లేని నేపథ్యంలో.. దేశ వ్యాప్తంగా ఉన్న ఏటీఎంలను రూ.200 నోటకు తగ్గట్లుగా బ్లాకులను అదనంగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి నాటికి మాత్రమే ఏటీఎంలలో రూ.200 లభించే వీలుందని.. ఒకవేళ నోటు బయటకు రావటం ఆలస్యమైతే.. అందుకు తగ్గట్లే ఏటీఎంలలో లభించే విషయంలోనూ మరికొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.