Begin typing your search above and press return to search.
సెల్ ఫోన్ తో ఏటీఎం నుంచి డబ్బులు
By: Tupaki Desk | 4 Jan 2017 4:47 AM GMTపెద్దనోట్ల రద్దు అనంతరం బ్యాంకింగ్ రంగంలో టెక్నాలజీ వినియోగం దూకుడుభారీగా పెరిగింది. సరికొత్త టెక్నాలజీతో నగదు రహితంగా లావాదేవీల్ని నిర్వహించేందుకు వీలుగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాల సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భీమ్ యాప్ ను ప్రధాని మోడీ విడుదల చేయటం.. దానికి దేశ ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. తాజాగా ఏటీఎంలను మార్చే అంశంపై ఆర్ బీఐ పని చేస్తోంది.ఇప్పటికే పలు దేశాల్లో అమల్లో ఉన్న తరహాలో ఏటీఎంలను మార్చాలన్న ఆలోచనలో ఆర్ బీఐ ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటివరకూ ఏటీఎంలో నుంచి డబ్బులు డ్రా చేయాలంటే.. డెబిట్ కార్డు.. పాస్ వర్డ్ అవసరం అవుతున్న సంగతి తెలిసిందే. దీనికి భిన్నంగా సెల్ ఫోన్ ను చూపించటం ద్వారా.. డబ్బుల్ని డ్రాచేసుకునే సరికొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు అవసరమైన టెక్నాలజీ మీద ఆర్ బీఐ వర్క్ వుట్ చేస్తోంది.
ఆర్ బీఐ తాజాగా అమలు చేయాలని భావిస్తున్న సాంకేతికతను ఇప్పటికే అమెరికా.. చైనా.. సింగపూర్.. ఆస్ట్రేలియాతో పాటు కొన్ని ఐరోపా దేశాల్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. రానున్న ఏడెనిమిది నెలల్లో ఈ కొత్త సాంకేతిక మన ఏటీఎంలలోకి రానుందని. కార్డు.. పాస్ వర్డ్ అవసరం లేకుండా కేవలం సెల్ ఫోన్ సాయంతో నగదును విత్ డ్రా చేసే సాంకేతికను చూస్తే..
ఇందుకు మొదట ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంకు యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందులో ఖాతా.. ఏటీఎం కార్డుల వివరాల్ని ఒకసారి నమోదు చేస్తే సరిపోతుంది ఇక.. ఏటీఎంల నుంచి నగదును విత్ డ్రా చేసుకోవాలంటే యాప్ ను ఓపెన్ చేసి.. ఏటీఎం విత్ డ్రాలో ఎంతమొత్తాన్ని డ్రా చేయాలనుకుంటున్న విషయాన్ని నమోదు చేయాలి. అనంతరం సెల్ ఫోన్ ను ఏటీఎం వద్దకు తీసుకెళ్లి.. అందులోని క్యూఆర్ కోడ్ సమీపంలో ఫోన్ ను ఉంచితే.. వినియోగదారుడి అనుమతిని కోరుతుంది. అనంతరం కోరిన మొత్తం ఏటీఎం మిషన్ నుంచి బయటకు వస్తుంది.
మొదట్లో పిన్ నెంబరు మార్చుకోవటం.. మినీ స్టేట్ మెంట్ తీసుకోవటం లాంటి ఫీచర్లు పని చేయవు. తాజా సాంకేతికతతో కార్డుల్ని క్లోనింగ్ చేసి.. ఏటీఎంల నుంచి పెద్ద ఎత్తున మొత్తాన్ని డ్రా చేసుకునే అవకాశం ఉండదు. చూస్తుంటే..రానున్న రోజుల్లో టెక్నాలజీ మరింత వేగంగా మారిపోవటమే కాదు.. ప్రజల్ని సైతం మారిన టెక్నాలజీ దిశగా అడుగులు వేయించేలా ఉందనటంలో సందేహంలేదు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/