Begin typing your search above and press return to search.

ప‌దివేల‌కు పైగా పాత‌నోట్లుంటే...జ‌రిమానే!

By:  Tupaki Desk   |   26 Dec 2016 5:07 PM GMT
ప‌దివేల‌కు పైగా పాత‌నోట్లుంటే...జ‌రిమానే!
X
పెద్ద నోట్ల రద్దు-త‌ద‌నంత‌ర ప‌రిణామాల్లో వెలుగులోకి వ‌స్తున్న వార్త‌ల్లో లేటెస్ట్ అప్‌ డేట్ ఇది. రూ.10వేల‌కు మించి ర‌ద్ద‌యిన వెయ్యి, ఐదు వంద‌ల నోట్లు క‌లిగి ఉన్నా-బ‌దిలీ చేసినా-స్వీక‌రించినా...స‌ద‌రు వ్య‌క్తుల‌పై ప‌న్ను విధించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంద‌ట‌. ర‌ద్ద‌యిన నోట్ల‌లో రూ. 1000 లేదా రూ.500 ల‌లో ఏ నోట్లు అయినా రూ.10 వ‌ర‌కు క‌లిగి ఉంటే ఇబ్బందేమీ లేద‌ని అయితే అంత‌కు మించి ఉంటే ఫైన్ వేయాల‌ని సిద్ధ‌మ‌య్యార‌ట‌. ఈ నిర్ణ‌యం డిసెంబ‌ర్ 31త‌ర్వాత అమ‌లులోకి రానుంద‌ని వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

ఈ కొత్త నిబంధ‌న‌ల ప్ర‌కారం నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా పాత నోట్ల‌ను క‌లిగి ఉంటే యాభై వేల ఫైన్ లేదా స‌ద‌రు మొత్తానికి ఐదు రెట్ల జ‌రిమానా విధించే దిశ‌గా అడుగులు వేస్తున్నారు. ఇలాంటి కేసుల‌ను విచారించే అధికారాన్ని మున్సిప‌ల్ మేజిస్ట్రేట్ కు క‌ట్ట‌బెట్టే దిశ‌గా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతున్నాయని స‌మాచారం. ఇదంతా రిజ‌ర్వ్ బ్యాంక్ మార్గ‌ద‌ర్శ‌కాల ప్ర‌కారం జ‌ర‌గ‌నుంద‌ని సమాచారం. డిసెంబ‌ర్ 31 త‌ర్వాత ర‌ద్దయిన‌ నోట్ల‌ను కేవ‌లం ఆర్‌ బీఐ అకౌంట్ల‌లో మాత్ర‌మే డిపాజిట్ చేసే నిబంధ‌న‌ను సైతం తీసుకురానున్నారు. న‌వంబ‌రు 8న పెద్ద నోట్ల ర‌ద్దు స‌మ‌యంలో ప్ర‌ధానమంత్రి ప్ర‌సంగిస్తూ వ్య‌వ‌స్థ‌లో చ‌లామ‌ణిలో ఉన్న సుమారు 15లక్ష‌ల‌ కోట్ల ఐదువంద‌లు - వెయ్యినోట్లు బ్యాంకుల వ‌ద్ద‌కు చేరుతాయ‌ని ప్ర‌క‌టించారు. అయితే డిసెంబ‌రు 12 వ‌ర‌కు సుమారుగా 13లక్ష‌ల కోట్ల మొత్త‌మే బ్యాంకుల‌కు చేరింది. మిగ‌తా మొత్తం చెలామ‌ణిలో ఉన్నాయా లేదా ఉద్దేశ‌పూర్వ‌కంగా డిపాజిట్ చేయ‌డం లేదా అనే విష‌యంలో సందేహం నెల‌కొంది. కేంద్రం త్వ‌ర‌లో వెలువ‌రించనున్న ఈ జ‌రిమాన నేప‌థ్యంలో ఎలాంటి ప‌రిణామాలు చోటుచేసుకుంటాయ‌నే చ‌ర్చ కొన‌సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/