Begin typing your search above and press return to search.

రోజుకు రూ.10వేలు: ఏటీఎంల దగ్గర నో క్యూ

By:  Tupaki Desk   |   16 Jan 2017 3:33 PM GMT
రోజుకు రూ.10వేలు: ఏటీఎంల దగ్గర నో క్యూ
X
‘‘తుపాకీ’’ అంచనా నిజమైంది. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఏటీఎంల విత్ డ్రా.. బ్యాంక్ విత్ డ్రా మీద ఈ రోజు కీలక ప్రకటన వెలువడుతుందన్న అంచనాను ముందే చెప్పేసింది. అంతేకాదు.. ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసే పరిమితిని పెంచుతూ ఆర్ బీఐ సానుకూలంగా నిర్ణయం తీసుకోనుందని.. సగటుజీవికి నోట్ల కష్టాలు.. ఏటీఎం క్యూ కష్టాలకు చెక్ పడినట్లేనన్న విషయాన్ని చెప్పేసింది.

ఇప్పుడదే నిజమైంది. ఏటీఎం.. బ్యాంకుల నుంచి విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని పెంచుతూ ఆర్ బీఐ తాజాగా అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇప్పటివరకూ ఉన్న ఏటీఎం విత్ డ్రా పరిమితిని రూ.4500 నుంచి రూ.10వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా కరెంటు ఖాతాలున్న వారు వారానికి విత్ డ్రా చేసే మొత్తాన్ని పెంచేసింది. ఇప్పటివరకూ ఉన్న రూ.50వేల పరిమితి స్థాయినుంచి రూ.లక్షకు పెంచుతూనిర్ణయం తీసుకుంది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం నేపథ్యంలో కరెంటు ఖాతాలున్న వారు వారానికి రూ.50వేల నగదును మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుందని.. అదే సమయంలో సేవింగ్స్ అకౌంట్ అయిన పక్షంలో రూ.24వేలు మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలు కల్పించారు. తాజాగా ఆ పరిమితిని సడలించి.. విత్ డ్రా చేసుకునే మొత్తాన్ని కరెంటు అకౌంట్లు ఉన్న వారికి మాత్రమే పెంచారు. అయితే.. సేవింగ్స్ ఖాతాలు ఉన్న వారికి మాత్రం వారానికి విత్ డ్రా చేసుకునే రూ.24వేలలో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. సేవింగ్స్ అకౌంట్లు ఉన్న వారు రోజులో రూ.10వేలు విత్ డ్రా చేసుకునే వీలున్నా.. వారానికి రూ.24 వేలు వరకూ మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుండనుంది. తాజా నిర్ణయం వల్ల ఏటీఎంల దగ్గర రద్దీ ఉండే అవకాశం లేనట్లే. ఒకేసారి రూ.10వేల మొత్తాన్ని విత్ డ్రా చేసుకునే వీలు ఉండటంతో ఒకసారి విత్ డ్రా చేసుకుంటే.. అదే పనిగా ఏటీఎంల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/