Begin typing your search above and press return to search.
విత్ర్ డ్రా లిమిట్ ను పెంచే దిశగా ఆర్ బీఐ
By: Tupaki Desk | 16 Jan 2017 7:34 AM GMTపెద్దనోట్ల రద్దు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలు తెలిసిందే. మొదట్లో ఏటీఎంలు పని చేయకపోవటం.. కొత్త నోట్ల కోసం బ్యాంకుల వద్ద.. ఏటీఎంల వద్దా జనాలు పడిన పాట్లు అన్నిఇన్ని కావు. తరచూ మార్చేస్తూ ఆర్ బీఐ తీసుకున్న నిర్ణయాలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అయ్యేవారు. ఏ రోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అన్న విషయం మీద పెద్దబెంగ ఉండేది.
సొంత డబ్బుల్నితీసుకోవటానికి కూడా పరిమితులేందన్న ఆగ్రహాన్ని కొందరు ప్రదర్శించినా.. దేశం కోసం ఇలాంటి తప్పవన్నట్లుగా కేంద్రం తీసుకున్న నిర్ణయాల్ని సమర్థించినోళ్లు ఎక్కువమందే ఉన్నారు. కొత్త సంవత్సరంలో ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ ను పెంచేసిన ఆర్ బీఐ.. తాజాగా వారానికి తీసుకునే విత్ డ్రా మొత్తాన్ని కూడా సవరించే దిశగా అడుగులు పడుతున్నట్లు చెబుతున్నారు. కొత్త సంవత్సరానికి ముందు ఏటీఎంల నుంచి రూ.2500 మొత్తాన్ని మాత్రమే విత్ డ్రా చేసుకునే వీలుంది. దాన్ని రూ.4500 మొత్తానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని అమలు చేయటంతో ఏటీఎంల దగ్గర క్యూ లైన్లు భారీగా తగ్గిపోయాయి.
తాజాగా అలాంటి నిర్ణయాన్ని ఆర్ బీఐ తీసుకుంటుందని చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ప్రస్తుతం ఉన్న విత్ డ్రా లిమిట్ ను పెంచే దిశగా ఆర్ బీఐ సమాలోచనలు చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కరెంటు ఖాతా నుంచి రూ.50వేలు.. సేవింగ్స్ ఖాతా నుంచి రూ.24వేల మొత్తాన్ని వారం వ్యవధిలో విత్ డ్రా చేసుకునే వీలు ఉంది. ఇప్పుడీ మొత్తాన్నిరూ.35వేల వరకూ లిమిట్ పెంచాలన్న యోచనలో ఆర్ బీఐ ఉందని చెబుతున్నారు. ఈ దిశగా త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/