Begin typing your search above and press return to search.

ప్రవాసీయులకు తీపి కబురు చెప్పిన ఆర్ బీఐ

By:  Tupaki Desk   |   30 Dec 2021 8:33 AM GMT
ప్రవాసీయులకు తీపి కబురు చెప్పిన ఆర్ బీఐ
X
ప్రవాసీయులకు రిలీఫ్ అయ్యే ప్రకటనను చేసింది భారతీయ రిజర్వు బ్యాంకు. ఇప్పటివరకు దేశీయంగా ఆస్తులు కొనాలన్నా.. అమ్మాలన్నా బోలెడంత ప్రొసీజర్ ఉండటం తెలిసిందే. అందుకు భిన్నంగా విదేశాల్లో స్థిరపడిన భారతీయులు కానీ.. ప్రవాసీయులు కానీ దేశంలో ఆస్తులు కొనాలంటే ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన విధివిధానాల విషయంలో కీలక మార్పులు చేస్తూ ఆర్ బీఐ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

ఇప్పటివరకు అనుసరిస్తున్న విధానాల్లో ముందస్తుగా ఆర్ బీఐ అనుమతి తప్పనిసరి. 1999 ఫెమా చట్టం ప్రకారం ఫారిన్ ఎక్సైంజ్ కు సంబంధించిన విధివిధానాల్ని భిన్నంగా ఉండేవి. భవనాలు.. భూములు.. పొలాలు.. ఫాం హౌస్ లు వేటిని కొనాలన్నా.. వేరే వారికి అమ్మాలన్నా అందుకు అమలవుతున్న ప్రొసీజర్ క్లిష్టంగా ఉండేది. దీంతో.. ఈ విధానాన్ని మార్చాలని వినతులు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే సుప్రీంకోర్టు సైతం ఇప్పటివరకు అనుసరిస్తున్న మార్గదర్శకాల్ని మార్చాలన్న విషయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో.. ఆర్ బీఐ కొత్త విధానాన్ని తెర మీదకు తీసుకొచ్చింది. 2021 ఫిబ్రవరి 26న సుప్రీం ఇచ్చిన తీర్పును అనుసరించి.. మార్పులు చేస్తున్నారు. ఈ కొత్త విధానంలో ఆస్తుల కొనుగోలుకు సంబంధించి ముందస్తు అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేకుంగా పోతుంది.