Begin typing your search above and press return to search.
రూ.200 నోటుకు రంగం సిద్ధమవుతోందట
By: Tupaki Desk | 29 Jun 2017 4:50 AM GMTకొత్త నోట్లు వచ్చేస్తున్నాయి. ఇప్పటివరకూ నోట్ల డినామినేషన్లో లేని సరికొత్త నోటు ఒకటి తెర మీదకు త్వరలో వచ్చేయనుంది. ఇందుకు సంబంధించిన ఆసక్తికర విషయం తాజాగా బయటకు వచ్చింది.
పెద్దనోట్లను రద్దు చేయటం.. ఇంతకు ముందు లేని రూ.2వేల నోటును తెర మీదకు తీసుకురావటం.. అదే సమయంలో వెయ్యి రూపాయిల్ని చెలామణీలో లేకుండా చేయటం లాంటి ఊహించలేని నిర్ణయాలు తీసుకోవటంలో మోడీ సర్కారు తీరే వేరు. తాజాగా రూ.200 నోటును తీసుకొచ్చే దిశగా మోడీ సర్కారు వడివడిగా అడుగులు వేస్తోంది. రూ.200 నోటును తీసుకురావాలని మోడీ సర్కారు నిర్ణయించిందని చెబుతున్నారు.
నగదు లావాదేవీల్లో ఎదురవుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వీలుగా రూ.200 నోటు తీసుకొస్తే మంచిదన్న అభిప్రాయానికి మోడీ సర్కారు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో.. రూ.200 నోట్ల ముద్రణను చేపట్టాలని ఆర్ బీఐకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలిసింది. సర్కారు అనుమతితో కొద్ది వారాల కిందటే రూ.200 నోట్లను ముద్రించటం మొదలు పెట్టినట్లుగా బయటకు వచ్చింది. మధ్యప్రదేశ్ లోని హోషంగాబాద్ లో ఉన్న ప్రభుత్వ మింట్ లో కొద్ది వారాల క్రితమే కొత్త నోట్లను ముద్రించే పనిని షురూ చేశారు.
వంద తర్వాత రూ.500 నోటు ఉండటం.. ఆ తర్వాత రూ.2వేల నోటు ఉండటంతో చిల్లర సమస్యలు అంతకంతకూ తీవ్ర మవుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నోట్ల కొరతను తీర్చేందుకు రూ.200నోటు సాయం చేస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇక.. రూ.200 నోటును ఈ ఏడాది చివరకు తీసుకురావాలని చెబుతున్నారు. ఇప్పటివరకూ లేని రూ.200 నోటు కొద్ది నెలల వ్యవధిలోనే అందరి జేబుల్లోకి రానుందన్న మాట.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/