Begin typing your search above and press return to search.
రెండువేల నోటు ఇక ఉండదేమో? ఏంటి సార్ మాకు ఈ ఖర్మ..!
By: Tupaki Desk | 28 May 2021 4:30 AM GMTపెద్ద నోట్ల రద్దుతో బ్లాక్‌మనీ మొత్తం వచ్చేస్తోంది. మోదీ గ్రేట్’అంటూ అప్పట్లో కాషాయపార్టీవాళ్లు ప్రచారం చేసుకున్నారు. కానీ ఆచరణలో అది అట్టర్‌ప్లాప్ అయ్యింది. పెద్ద నోట్ల రద్దుతో పేదలు ఏటీఎం సెంటర్ల ముందు క్యూ కట్టారు తప్ప.. పెద్దవాళ్లకు ఏ ఇబ్బంది కలగలేదని అందరికీ తెలిసిపోయింది. అయితే అప్పట్లో రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేసిన కేంద్రప్రభుత్వం .. రెండువేల నోట్లను ముద్రించింది. దీంతో బ్లాక్‌మనీని మరింత పెంచిపోషిస్తున్నారన్న ఆరోపణ కూడా వచ్చింది.
నోట్ల రద్దు మోదీ ఇమేజ్ ను పెంచకపోగా.. కిందకు దిగజార్చింది. అయినప్పటికీ 2019 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో ఘనవిజయం సాధించింది. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. నోట్ల రద్దు, జీఎస్టీ అనే అంశాలు ఆ ఎన్నికల్లో తెరమీదకు రాలేదు. అంటే రాకుండా జాగ్రత్త పడ్డారు. దేశభద్రత, దేశభక్తి ప్రధాన ఎన్నికల నినాదాలు అయ్యాయి. వెరసి మోదీ విక్టరీ సాధించారు. ఏ ప్రాంతీయ పార్టీ మద్దతు లేకుండానే అధికారం చేపట్టాడు. కానీ ప్రస్తుతం మోదీ గ్రాఫ్ తగ్గిపోతుంది. అందుకు కోవిడ్ సెకండ్ వేవ్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయకపోవడమే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా మరో పెద్ద నోటు రూ. 2000 కూడా చలామణిలో లేకుండా పోతుందని సమాచారం. నిజానికి రెండువేల నోటును రద్దు చేయబోతున్నారని చాలా కాలాంగా టాక్ నడిచింది. అయితే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏదీ వెలువడలేదు. కానీ రిజర్వ్‌బ్యాంక్ తాజాగా విడుదల చేసిన వార్షిక నివేదికను గమనిస్తే మాత్రం రూ. 2000 నోటును చలామణి నుంచి తప్పించబోతున్నారని తెలుస్తున్నది.
2019-20 ఆర్థిక సంవత్సరంలో చలామణీలో ఉన్న రూ.2,000 నోట్ల విలువ రూ.5,47,952 కోట్లు అయితే.. 2020-21 ఆర్థిక సంవత్సరంలో వీటి విలువ రూ.4,90,195 కోట్లు అని వెల్లడైంది. అంటే ఒకే సంవత్సరంలో రూ.57,757 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు చలామణినుంచి తప్పించారని అర్థమవుతున్నది. ప్రస్తుతం రిజర్వ్‌బ్యాంక్ రూ. 500 నోట్ల ముద్రణపై దృష్టి ఎక్కువగా పెట్టింది. దీంతో రెండువేల నోట్లను క్రమంగా తగ్గించబోతున్నారని అర్థమవుతున్నది. ఇందుకు గల కారణాలు ఏమిటో స్పష్టంగా తెలియదని ఆర్థిక నిపుణులు అంటున్నారు.