Begin typing your search above and press return to search.
లాక్ డౌన్ వేళ RBI కీలక ప్రకటనలు ఇవే!
By: Tupaki Desk | 17 April 2020 7:30 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామని తెలిపిన ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ - కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక ప్రకటనలు చేశారు. ఇందులో ప్రధానంగా కరోనా లాక్ డౌన్ కారణంగా స్థూల ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బ తిన్నదని - ఈ సందర్భంగా ప్రపంచ మార్కెట్లన్నీ కుదేలు అయ్యాయని తెలిపారు. ఖరీఫ్ లో 36 శాతం ధాన్యం ఉత్పత్తి పెరిగింది అని అన్నారు.
1930 తర్వాత ఇంతటి సంక్షోభం ఎప్పుడూ ఎదురుకాలేదన్నారు. లాక్ డౌన్ వల్ల ప్రపంచ జీడీపీకి 9ట్రిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది అని , 2020లో భారత వృద్ధిరేటు 1.9శాతం ఉంటుందని ఐఎంఎఫ్ అంచనా వేసిందని - జీ-20 దేశాల్లో భారత్ జీడీపీనే అధికమన్నారు. 2021-22 నాటికి జీడీపీ వృద్ధిరేటు 7.4శాతానికి చేరుకుంటుందని అంచనా వేశామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా దేశాల వృద్ధిరేట్లు తిరోగమనంలో ఉన్నాయి అని - లాక్ డౌన్ తర్వాత రూ.1.20లక్షల కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. దేశ వ్యాప్తంగా 91శాతం ఎటీఎంలు పనిచేస్తున్నాయి. బ్యాంకులు - ఎటీఎంలలో ఎప్పటికప్పుడు నగదు నింపుతునట్టు తెలిపారు.
అలాగే , రివర్స్ రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు తగ్గించి - 4శాతం నుంచి 3.75శాతానికి రివర్స్ రెపో రేటు తగ్గించినట్టు తెలిపారు. సూక్ష్మ ఆర్థిక సంస్థలకు రూ.50 వేల కోట్లు - నేషనల్ హౌసింగ్ బోర్డుకు రూ.10 వేల కోట్లు - నాబార్డ్ కు రూ.25 వేల కోట్లు - ఎస్ ఐడీబీఐకి 15 వేల కోట్లు - చిన్న తరహా పరిశ్రమలకు 50 వేల కోట్లు కేటాయించామన్నారు. రాష్ట్రాలకు 60శాతం డబ్ల్యూఎంఏ పెంచామని.. సెప్టెంబర్ 30వరకు డబ్ల్యూఎంఏ పెంపు అమలవుతుందన్నారు. మారటోరియం సమయం లో 90 రోజుల ఎన్ పీఏ గడువు వర్తించదన్నారు.