Begin typing your search above and press return to search.

ఈ 12 మంది ఎగ్గొట్టింది రూ.4ల‌క్ష‌ల కోట్లు

By:  Tupaki Desk   |   14 Jun 2017 4:23 AM GMT
ఈ 12 మంది ఎగ్గొట్టింది రూ.4ల‌క్ష‌ల కోట్లు
X
బ్యాంకోడి ద‌గ్గ‌రికి వెళ్లి ఓ ప‌దివేలు అప్పు ఇవ్వ‌మ‌ని అడిగితే స‌వాల‌చ్చ ఫార్మాలిటీస్ చెప్పుకొస్తాడు. ఇక‌.. ల‌చ్చ రూపాయిలు అప్పు కావాల‌ని వెళితే.. బోలెన్ని పేప‌ర్లు రుజువులుగా ఇస్తే కానీ బ్యాంకులో నుంచి పైస‌లు బ‌య‌ట‌కు రావు. మ‌రి.. అలాంటి కంపెనీలు బ‌డాబాబులకు.. కంపెనీల‌కు ఇచ్చే కోట్లాది రూపాయిల లెక్క తెలిస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది.

లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యాకు వేలాది కోట్ల రూపాయిలు బ్యాంకులు పోటీప‌డి మ‌రీ అప్పులు ఇవ్వ‌టం.. ఇప్పుడాయ‌న దేశం విడిచి బ్రిట‌న్ వెళ్లిపోవ‌టం తెలిసిందే. ఇదే తీరులో బ్యాంకుల‌కు శ‌ఠ‌గోపం పెట్టేసినోళ్లు భారీగానే ఉన్నారు. దేశ వ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన అప్పుల్లో మొండి బ‌కాయిలుగా ఉన్న మొత్తం ఎంతో తెలుసా? అక్ష‌రాల రూ.8ల‌క్ష‌ల కోట్లు. గుండెలు చిక్క‌బ‌డే మ‌రో చేదు నిజం ఏమిటంటే.. ఇందులో యాభై ప‌ర్సెంట్ కేవ‌లం 12 మందికే ఇచ్చారు మ‌రి.అంటే.. దేశం మొత్తమ్మీదా రాని బాకీల విలువ రూ.8ల‌క్ష‌ల కోట్లు ఉంటే.. అందులో ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర రూ.4ల‌క్ష‌ల కోట్లే కేవ‌లం 12 మందికే బ్యాంకులు ఇచ్చిన తీరు చూస్తే నోట మాట రాకుండా పోవ‌టం ఖాయం.

ఇంత‌వ‌ర‌కూ ఈ 12 మంది (డ‌ర్టీ డ‌జ‌న్‌) పేర్ల‌ను బ‌య‌ట పెట్ట‌కుండా ఉన్న‌ప్ప‌టికీ.. తాజాగా ఆ పేర్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇందులో ది గ్రేట్ లిక్క‌ర్ కింగ్ పేరును చేర్చ‌లేదు. ఎందుకంటే అత‌గాడి వ్య‌వ‌హారం మీద కోర్టులో కేసులు న‌డుస్తున్న నేప‌థ్యంలో అత‌డి పేరును మిన‌హాయించారు. ఇదిలా ఉంటే.. మొండి బ‌కాయిల్ని రిక‌వ‌రీ చేసే విష‌యంలో చ‌ర్య‌లు మొద‌లెట్టిన రిజ‌ర్వ్ బ్యాంకు.. తాజాగా డ‌ర్టీ డ‌జ‌న్‌ ను గుర్తించి.. వారి నుంచి పైస‌లు వెన‌క్కి తీసుకునే ప్లాన్లు వేస్తున్న‌ట్లు చెబుతున్నారు. రూ.4ల‌క్ష‌ల కోట్ల అప్పులు చెల్లించాల్సిన 12 మంది మీద దివాళా చ‌ట్టాన్ని ప్ర‌యోగించి చ‌ర్య‌లు తీసుకోవాల‌న్న‌ట్లుగా ఆర్ బీఐ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కూ బ‌య‌ట‌కు రాని.. ఈ డ‌ర్టీ డ‌జ‌న్ కు సంబంధించిన పేర్లు తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అధికారికంగా రాన‌ప్ప‌టికీ.. ప్రముఖ మీడియా సంస్థ‌లు డ‌ర్టీ డ‌జ‌న్ పేర్ల‌ను ప్ర‌చురించాయి. ఈ ప‌న్నెండు మంది ఎవ‌ర‌న్న‌ది చూస్తే..

1. భూష‌ణ్ స్టీల్ రూ.90వేల కోట్లు

2. వీడియోకాన్ ఇండ‌స్ట్రీస్ రూ.58 వేల కోట్లు

3. జేపీ గ్రూప్ రూ.55వేల కోట్లు

4. ఎస్సార్ లిమిటెడ్ రూ.50వేల కోట్లు

5. జిందాల్ గ్రూప్ రూ.38వేల కోట్లు

6. అలోక్ ఇండ‌స్ట్రీస్ రూ.25వేల కోట్లు

7. ల్యాంకో రూ.19వేల కోట్లు

8. ఏజీజీ షిప్ యార్డ్ రూ.15వేల కోట్లు

9. పుంజ్ లాయిడ్ రూ.14వేల కోట్లు

10. ఎల‌క్ట్రోస్టీల్ స్టీల్స్ రూ.14వేల కోట్లు

11. అబాస్ హోల్డింగ్స్ రూ.14వేల కోట్లు

12. అబాన్ హోల్డింగ్స్ రూ.13వేల కోట్లు