Begin typing your search above and press return to search.
నేపాల్ లో తీరనున్న నోట్ల రద్దు కష్టాలు
By: Tupaki Desk | 7 Jan 2017 7:13 AM GMTభారత్‌లో పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వల్ల ఇక్కడి ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడ్డారో.. మన పొరుగునే ఉన్న నేపాల్ ప్రజలూ అంతకంటే ఇబ్బందులు పడుతున్నారు. మనకు ఇక్కడ కొద్దిరోజులుగా ఏటీఎంలలో డబ్బులు పెడుతుండడంతో చాలావరకు కష్టాలు తీరాయి. కానీ.. ఇండియన్ కరెన్సీ బాగా చలామణీలో ఉండే నేపాల్ లో అక్కడి ప్రజల వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకునే అవకాశమే ఇండియా ఇంతవరకు ఇవ్వలేదు. దీంతో.. వారి ఇబ్బందులు ఇంకా తీరలేదు. అయితే.. తాజాగా నేపాల్ కు వంద కోట్ల రూపాయల విలువైన రూ.100 నోట్లను పంపించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంకు(ఆర్బీఐ) ముందుకొచ్చింది. పాతనోట్ల మార్పిడికి ఏర్పాట్లు చేసింది.
ఇక్కడ భారత కరెన్సీ విరివిగా చలామణిలో ఉండడంతో నోట్ల రద్దు ప్రభావం వారిపైనా పడింది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలు డబ్బులు లేక అల్లాడిపోతున్నారు. వారి అవస్థలను దృష్టిలో పెట్టుకుని వారికి భారీ మొత్తంలో డబ్బులు పంపాలని ఆర్బీఐ నిర్ణయించింది. భారత ప్రభుత్వం పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత తమ దేశంలోని భారత కరెన్సీని చలామణి చేసుకునేందుకు అవకాశం కల్పించాలంటూ గత కొంతకాలంగా నేపాల్ రాష్ట్ర బ్యాంకు భారత్ ను కోరుతోంది. దీంతో స్పందించిన ఆర్బీఐ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జనవరి మాసాంతానికి రూ.100 కోట్ల విలువైన రూ.100 నోట్లను పంపించాలని నిర్ణయించింది.
మరోవైపు ఇంతకుముందే నేపాల్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భారత్ ను కోరింది. అయితే, దేశంలో సమస్యలనే తీర్చలేని పరిస్థితుల్లో మన దేశం దాన్ని పట్టించుకోలేదు. దీంతో నేపాల్ మన కొత్త కరెన్సీని అక్కడ బ్యాన్ చేసింది. తాజా పరిణామాలతో మళ్లీ ఎప్పటిలాంటి పరిస్థితులు ఏర్పడతాయని భావిస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/