Begin typing your search above and press return to search.

కొత్త పచ్చ 20నోటు.. ప్రత్యేకతలివే..

By:  Tupaki Desk   |   27 April 2019 9:51 AM GMT
కొత్త పచ్చ 20నోటు.. ప్రత్యేకతలివే..
X
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్ ప్రైజ్ ఇచ్చింది. త్వరలో కొత్త రూ.20 నోట్లను విడుదల చేయబోతోంది. ఇది వరకూ ఎప్పుడూ వాడని కలర్ ను ఇందులో వాడుతుండడం విశేషం. మహాత్మాగాంధీ సిరీస్ లో భాగంగా ఈ నోట్లను చూడడానికి గ్రీన్ కలర్, ఎల్లో కలర్ మిక్స్ చేసి సరికొత్త రూపంలో తెస్తున్నట్టు ఆర్బీఐ తెలిపింది. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకంతో ఇవి త్వరలోనే విడుదల కానున్నట్టు ఆర్బీఐ తెలిపింది.

మహాత్మాగాంధీ బొమ్మ, పక్కన దేవనాగరి లిపిలో రూ.20 అని రాసి ఉంటే ఈ నోటులో ఆశోకుడి స్థూప చిహ్నం ఉంటుంది. ఇక ఈ నోటు వెనుక భాగంలో ఎల్లోరా గుహల చిత్రాన్ని స్వచ్ఛభారత్ లోగో నినాదం ముద్రించారు. దేశ సంస్కృతి - వారసత్వ సంపదను గుర్తు చేస్తూ ఎల్లోరా గుహలను ముద్రించారు. నోటుకి రెండు వైపులా డిజైన్లు, జామెట్రిక్ ప్యాట్రన్లూ ఉంటాయి. ధర్మ సంస్థాపనను గుర్తు చేస్తూ అశోకుడి స్థూపాన్ని ముద్రించారు.

ఈ కొత్త నోట్లు వచ్చినా పాత రూ.20 నోట్లు చెలామణీ అవుతాయని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. కొత్త నోటుకు సంబంధించి నమూనాను తాజాగా విడుదల చేసింది. ఇప్పటికీ రూ.10, రూ.100 విలువ చేసే కొత్త నోట్లను ఆర్బీఐ విడుదల చేసింది. తాజాగా రూ.20 రూపాయల నోటును తెస్తోంది. ఐతే దీని కలర్ మిగతా వాటికంటే చాలా భిన్నంగా ఉందంటున్నారట ఆర్థికవేత్తలు.

ఆర్బీఐ లెక్కల ప్రకారం 2016 మార్చి 31 నాటికి 4.92 బిలియన్ల రూ.20 నోట్లు చలామణీలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సంఖ్య 10 బిలియన్లకు దగ్గరగా ఉంది. మొత్తం కరెన్సీ లో 9.8శాతం వాటా ఉన్న రూ.20 నోట్లను కొత్త రూపంలో తేవాలని చాలా కాలం నుంచి ఆర్బీఐ కసరత్తు చేస్తున్నారు. రెండేళ్లుగా ఈ నోటులో ఎలాంటి మార్పులు జరగలేదు. అది ఇప్పటికీ సాధ్యమైంది.