Begin typing your search above and press return to search.

ఏటీఎం బాదుడు తగ్గనుంది

By:  Tupaki Desk   |   29 Jan 2016 10:30 PM GMT
ఏటీఎం బాదుడు తగ్గనుంది
X
ఏటీఎంలు విస్తృతమయ్యాక ప్రజలకు ఎంతో సులభమైపోయింది. అయితే... అదేసమయంలో ఏటీఎంలపై తాకిడీ పెరిగిపోయింది.. పెద్ద మొత్తంలో డబ్బు డ్రాచేసుకుని ఇంట్లో ఉంచుకునే కంటే ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఏటీఎంకు వెళ్లి తెచ్చుకోవడం బెటరన్న ఉద్దేశంతో చాలామంది ఏ రోజుకు అవసరమైన మొత్తం ఆ రోజు విత్ డ్రా చేసుకుంటుంటారు. దీనివల్ల ఏటీఎంలపై ఒత్తిడి పెరగడం... నిర్వహణ బ్యాంకులకు భారం కావడం సహజం. దీంతో ఏటీఎం సేవలు పొందడంపై ఇంతకుముందే పరిమితి విధించారు. పరిమితి దాటితే ఫైన్ పడుతుండడంతో జనం కంట్రోలయ్యారు. అయితే... పరిమితి బాగా ఎక్కువైందని భావించిన ప్రబుత్వం కొంచెం సడలించాలని భావిస్తోంది.

దేశ వ్యాప్తంగా ఏటిఎం ఫ్రీ విత్ డ్రాయాల్స్ సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం మెట్రో నగరాలతో పాటు బెంగుళూరు - హైదరాబాద్ నగరాలలో ఇతర బ్యాంకు ఏటిఎం లలో కేవలం మూడు విత్ డ్రాయాల్స్ కే ఆస్కారం ఉంది. ఇతర నగరాల్లో అయిదు విత్ డ్రాయాల్స్ కే అనుమతి ఇస్తున్నారు. ఇక సొంత బ్యాంకు ఏటిఎంల నుంచి విత్ డ్రాయాల్స్ పై కూడా ఆంక్షలు ఉన్నాయి. పరిమిత సంఖ్య దాటితే ఒక్కో విత్ డ్రాయాల్ కు రూ.20 దాకా ఛార్జి చేస్తున్నారు. దీంతో దీనిపై అవగాహన లేనివారు... అత్యవసరమైనవారు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు ప్రభుత్వం కూడా జన్ ధన యోజన - పోస్టుఫీసులలో ఏటిఎంలను పెట్టాలని అనుకుంటున్న నేపథ్యంలో మళ్లీ ఫ్రీ విత్ డ్రాయల్స్ సంఖ్య పెంచాలని అనుకుంటోంది. ఈ మేరకు బ్యాంకులు, ఆర్ బీఐ తో చర్చలు జరుపుతోంది. గ్రామీణ ప్రాంతల్లో అసలు పరిమితే పెట్టరాదని... నగరాల్లో ఇప్పుడున్న కంటే ఎక్కువ ఉచిత విత్ డ్రాయల్ సౌకర్యం ఇవ్వాలని భావిస్తున్నారు.