Begin typing your search above and press return to search.
క్రిప్టోలు.. కనీసం ‘తులిప్ పువ్వు’ విలువ కూడా చేయవు
By: Tupaki Desk | 11 Feb 2022 1:30 AM GMTదేశ ఆర్థిక వ్యవస్థ.. ఆర్థిక స్థిరత్వానికి క్రిప్టో కరెన్సీతో ముప్పు పొంచి ఉందని భారతీయ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి హెచ్చరించారు. వర్చువల్ కాయిన్లకు లోబడిన ఆస్తులేవి లేవని స్పష్టం చేశారు. కనీసం తులిప్ పువ్వులు కూడా లేవన్నారు. ‘ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించే ఆర్బీఐ సామర్థ్యాన్ని క్రిప్టో కరెన్సీలు దెబ్బతీస్తాయి’ అని ఆయన స్పష్టం చేశారు.
క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. వర్చువల్ కాయిన్లకు అసలు అండర్ లైయింగ్ అసెట్స్ ఉండవని వెల్లడించారు. క్రిప్టో కరెన్సీలపై దాస్ గతంలోనూ ఇలాగే వ్యాఖ్యలు చేశారు. వాటితో ఆర్థిక వ్యవస్థకు ముప్పు ఉంటుందని ప్రకటించారు. బడ్జెట్ లో క్రిప్టోలపై 30శాతం పన్ను విధిస్తున్నామని ప్రభుత్వం ప్రకటించిన తర్వాత ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి.
అయితే క్రిప్టో కొనుగోళ్లు.. అమ్మకాలకు చట్టబద్ధత కల్పించడాన్ని మాత్రం సంబంధిత స్టేక్ హోల్డర్లు ఆహ్వానిస్తున్నారు. 2022-23 ఆర్థిక ఏడాదిలోనే ఆర్బీఐ డిజిటల్ రూపాయిని ఆవిష్కరిస్తాం.. ఎప్పుడు విడుదల చేస్తామన్నా టైమ్ లైన్ ను ఇప్పుడే చెప్పలేం.. అయితే డిజటల్ రూపాయి..సాధారణ రూపాయి మధ్య ఎలాంటి తేడా ఉండదు. కానీ క్రిప్టో కరెన్సీని బయటి వ్యక్తులు సృష్టిస్తారని.. దాంతో ఆర్థిక భద్రత, స్థిరత్వం దెబ్బతింటుందని ఆర్బీఐ గవర్నర్ మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు.
సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీపై పని జరుగుతోందని.. ప్రతిపాదన మేరకు చట్టాన్ని సవరించగానే మా కాన్సెప్ట్ లతో పైలెట్ ప్రాజెక్టులు మొదలవుతాయని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవిశంకర్ వెల్లడించారు. గురువారం ఉదయం ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష ఫలితాలను శక్తికాంత దాస్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే..
కీలక వడ్డీ రేట్లలో వరుసగా పదోసారి ఎలాంటి మార్పు చేయలేదు. రెపోరేటును 4 శాతంగానే ఉంచారు. 3.35 శాతంగా ఉన్న రివర్స్ రెపోరేటును సవరించలేదు. ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.