Begin typing your search above and press return to search.
కుంతియా నోట కూడా సొల్లు మాటలా?
By: Tupaki Desk | 1 Jan 2019 5:48 AM GMTరచ్చబండ దగ్గర మాట్లాడుకునే మాటల మాదిరి ఢిల్లీ స్థాయి నాయకుడు మాట్లాడితే ఎలా ఉంటుంది? తన స్థాయిని మరిచి.. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో తెగ తిరిగిన కుంతియా సారూ మాటల్లో తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. సాక్ష్యాలు.. ఆధారాలు అన్నవి చూపించకుండా.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు అలవాటే.
అదే తీరును ప్రదర్శిస్తున్న కుంతియా తాజాగా చేసిన మాటలు వింటే.. ఔరా.. కుంతియాసాబ్ ఏమైంది మీకు అనిపించక మానదు. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని.. ఈవీఎంల ట్యాంపరింగ్ కు పాల్పడ్డారంటూ రొడ్డుకొట్టుడు డైలాగులు చెబుతున్న తీరు ఆయన స్థాయిని దిగజార్చేలా ఉందని చెప్పక తప్పదు.
ఇక్కడితో ఆగని ఆయన.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ వ్యవహారశైలి.. ఓట్ల లెక్కింపులో తేడా తదిరత అంశాలపై తాము రాష్ట్రపతిని కలుస్తామని చెబుతున్నారు కుంతియా. రాష్ట్రపతి లాంటి పెద్దమనిషి దృష్టికి తీసుకెళ్లే అంశాల్ని.. సామాన్య ప్రజల ముందు పెట్టొచ్చుగా?
ఎన్నికల ఫలితాలకు ముందు తమదే అధికారమంటూ విర్రవీగి.. తెలంగాణ ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా వ్యవహరించిన తీరుకు కర్ర కాల్చి వాత పెట్టిన వైనం తెలిసిందే. కేసీఆర్ అలా చేశారు.. ఇలా చేశారంటూ ఉత్త మాటలు చెప్పే కన్నా..ఎదవ పనులు చేశారన్న దాన్ని నిరూపిస్తూ.. వాటికి తగ్గ ఆధారాల్ని చూపిస్తే అంతో ఇంతో విలువ ఉంటుంది. అదేమీ లేకుండా నోటికి వచ్చినట్లుగా మాటలు చెబితే లాభం కంటే నష్టమే ఎక్కువ.
ఇప్పటికే పలువురు కాంగ్రెస్ నేతల సొల్లు పురాణంతో కాంగ్రెస్ పరపతి మరింత తగ్గింది. దాన్ని ఇంకాస్త దిగజార్చేలా కుంతియా మాటలు ఉన్నాయని చెప్పక తప్పదు. కేసీఆర్ లాంటి అధినేతపై ఏదైనా ఆరోపణలు చేసే ముందు పక్కా సమాచారం చేతపట్టుకొని మాట్లాడాలే కానీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదు. ఆ తీరును మార్చుకోకుంటే త్వరలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనూ అసెంబ్లీ సీన్ రిపీట్ కాక మానదు. ఆ విషయాన్ని గుర్తెరిగి వ్యవహరిస్తే కుంతియా లాంటి వారికి మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.