Begin typing your search above and press return to search.
ఏంది కుంతియా..కాంగ్రెస్ టికెట్లకు అంత డిమాండ్ ఉందా?
By: Tupaki Desk | 23 March 2019 4:38 AM GMTగొప్పలు చెప్పుకోవటం కూడా ఒక అర్టే. అలాంటి కళ అందరికి చేతకాదు. అబద్ధమైనా అతికినట్లు ఉండాలి. అందుకు తగ్గట్లే తాజాగా చెప్పిన కుంతియా మాటలు వింటే.. ఔరా అనుకోవాల్సిందే. ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ టికెట్ల కోసం ఎంత డిమాండ్ ఉందన్న విషయాన్ని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే లేదు. అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. పార్టీలో ఎంతమంది ఉంటారన్న దానిపైనే క్లారిటీ లేని వేళ.. పార్టీ టికెట్ల కోసం ప్రయత్నించేటోళ్లు ఎంతమందన్నది ఇప్పుడు ప్రశ్నే.
అయితే.. ఇదంతా మనలాంటోళ్ల ఫీలింగ్ అని.. కాంగ్రెస్ టికెట్లను ఆశిస్తున్న వారు మస్తు మంది ఉన్నట్లు చెబుతున్నారు తెలంగాణరాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి కుంతియా చెబుతున్నారు. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు టికెట్లు ఆశిస్తున్న ఆశావాహుల సంఖ్య ఎక్కువగా ఉందని ఆయన చెబుతున్నారు. ఖమ్మం ఎంపీ స్థానం నుంచి రేసులో రేణుకా పేరు పరిశీలనలో ఉందని చెప్పిన ఆయన.. కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని నిర్వీర్యం చేస్తున్నట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ మీదా.. ఆయన వ్యవహరిస్తున్న తీరు మీద కుంతియా మాట్లాడిన మాటల్ని కాసేపు పక్కన పెడితే.. కాంగ్రెస్ టికెట్ల కోసం ఆయన చెబుతున్న గొప్పలు వింటే ముక్కున వేలేసుకోవాల్సిందే. బడాయి మాటలు చెప్పుకోవద్దని చెప్పం కానీ.. మరీ ఇంత బడాయా? అన్నది ప్రశ్న. ఇంకా నయం.. కాంగ్రెస్ టికెట్లు ఆశిస్తున్న వారి మధ్య పోటీ మామూలుగా లేదని.. ఆశావాహుల తాకిడిని తట్టుకోలేక.. వారిని కంట్రోల్ చేయటం కుదరక లాఠీ ఛార్జ్ చేయించాల్సి వస్తుందన్న మాటల్ని చెప్పనందుకు సంతోషించాలేమో! గ్రేట్ కుంతియా సాబ్.. ఓపక్క పార్టీ ఆస్తిత్వం క్వశ్చన్ మార్క్ గా మారుతున్న రాష్ట్రంలో టికెట్ల కోసం ఆశావాహులు భారీగా ఉన్నారన్న బడాయి కబుర్లు మీరు మాత్రమే చెప్పుకోగలరేమో?