Begin typing your search above and press return to search.

ఆర్సీబీ vs కేకేఆర్ : ఓడితే ఇంటికే .. ఎవరి బలం ఎంత !

By:  Tupaki Desk   |   11 Oct 2021 7:31 AM GMT
ఆర్సీబీ vs కేకేఆర్ : ఓడితే ఇంటికే .. ఎవరి బలం ఎంత !
X
ఐపీఎల్ 2021 సీజన్‌లో మరో ఆసక్తికరమైన సమరానికి సోమవారం షార్జా వేదికగా తెరలేవనుంది. సీజన్ లీగ్ దశ ముగిసే సమయానికి పాయింట్ల పట్టికలో మూడు, నాలుగు స్థానాల్లో నిలవడం ద్వారా ప్లేఆఫ్స్‌ కి చేరిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్‌ కతా నైట్‌రైడర్స్ మధ్య ఈరోజు రాత్రి 7.30 గంటలకి ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ లో గెలిచిన జట్టు బుధవారం షార్జా వేదికగానే ఢిల్లీ క్యాపిటల్స్‌ తో క్వాలిఫయర్-2 మ్యాచ్‌ లో ఆడనుంది.

ఓడిన టీమ్ టోర్నీ నుంచి నిష్క్రమించి , ఇక ఇంటికి పయనం కావాల్సిందే. కోల్‌ కతా, బెంగళూరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ రికార్డుల్ని ఓసారి పరిశీలిస్తే , ఈ రెండు జట్లు ఇప్పటి వరకూ 28 మ్యాచ్‌ ల్లో ముఖాముఖి తలపడ్డాయి. ఇందులో కోల్‌ కతా 15 మ్యాచ్‌ ల్లో విజయం సాధించగా.. మిగిలిన 13 మ్యాచ్‌ ల్లో బెంగళూరు గెలిచింది. ఇక చివరిగా ఆడిన నాలుగు మ్యాచ్‌ లకిగానూ మూడింట్లో బెంగళూరు గెలుపొందగా,ఐపీఎల్ 2021 సీజన్ లీగ్ దశలో చెరొక మ్యాచ్‌ లో విజయం సాధించాయి. ప్లే ఆఫ్స్ అనుభవంపరంగా చూసుకున్నా బెంగళూరు కంటే కోల్‌ కతా ముందజలో ఉంది. ఇప్పటికే కోల్‌కతా రెండు సార్లు ఐపీఎల్ టైటిల్ విజేతగా నిలవగా.. బెంగళూరు కనీసం ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది.

అయితే.. కెప్టెన్‌ గా తనకి ఇదే చివరి ఐపీఎల్ సీజన్ అని కోహ్లీ ప్రకటించిన నేపథ్యంలో బెంగళూరు టీమ్ గట్టిగా పోరాడే అవకాశం ఉంది. టీమ్ బలాబలాల్ని పరిశీలించినా కోల్‌ కతా కంటే బెంగళూరు టీమ్ మెరుగైన స్థితిలో కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా.. ఢిల్లీ క్యాపిటల్స్‌ తో జరిగిన ఆఖరి మ్యాచ్‌ లో చివరి బంతికి కేఎస్ భరత్ సిక్స్ కొట్టడంతో గెలిచిన బెంగళూరు ఇప్పుడు మంచి జోష్ మీద కనిపిస్తోంది. ఐపీఎల్ 2021 తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించి చెన్నై ఫైనల్లో అడుగు పెట్టింది. 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై ఆదిలోనే డుప్లిసిస్ వికెట్‌ కోల్పోయింది. ఆనంతరం బ్యాటింగ్‌ వచ్చిన రాబిన్ ఊతప్ప, రుతురాజ్ గైక్వాడ్‌ ఇద్దరూ కలిసి రెండో వికెట్‌కి 110 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి చెన్నై ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. ఊతప్ప 44 బంతుల్లో 7 ఫోర్లు, 63 పరుగులు చేసి టామ్ కుర్రాన్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. అనంతరం 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్‌ కరన్‌ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేరగా, రబాడా బౌలింగ్‌లో అంబటి రాయుడు రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు.

50 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 70 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్, ఆవేశ్ ఖాన్ బౌలింగ్‌ లో అక్షర్ పటేల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆవేశ్ ఖాన్ వేసిన 19వ ఓవర్‌లో మొయిన్ ఆలీ ఓ ఫోర్, ధోనీ ఓ సిక్సర్ బాదడంతో 11 పరుగులు వచ్చాయి. టామ్‌ కరన్‌ వేసిన అఖరి ఓవర్‌లో 13 పరుగుల కావల్సిన సమయంలో తొలి బంతికి మొయిన్ ఆలీ ఔట్‌ అవ్వగా, వరుసగా 3 ఫోర్లు బాది ధోని చెన్నైను విజయతీరాలకు చేర్చాడు. ధోని కేవలం 6 బంతుల్లో 3ఫోర్లు 1 సిక్స్‌ తో 18 పరుగులు సాధించాడు.

అంతక ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌ నీర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన ఢిల్లీ ఆదిలోనే శిఖర్ ధావన్ వికెట్‌ కోల్పోయింది. అయినప్పటకీ పృథ్వీ షా ఫోర్లు, సిక్సర్‌లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అంతకుముందు 4పరుగుల వ్యవధిలో చెన్నై మూడు వికెట్లు కోల్పోయింది. టామ్‌ కరన్‌ వేసిన 14 ఓవర్లలో ఊతప్ప ,శార్దుల్ ఠాకూర్ పెవిలియన్‌కు చేరగా, రబాడా బౌలింగ్‌లో అంబటి రాయుడు రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. 15 ముగిసే సరికి చెన్నై నాలుగు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో రుతురాజ్ గైక్వాడ్(52),మొయిన్‌ అలీ(1) పరుగులతో ఉన్నారు. కాగా చెన్నై విజయానికి 30 బంతుల్లో 52 పరుగులు కావాలి.