Begin typing your search above and press return to search.
పడిక్కల్..పట్టించుకోనోడే 'పరుగులు' పెట్టిస్తున్నాడు
By: Tupaki Desk | 4 Oct 2020 2:30 PM GMTఐపీఎల్లో మొదటి నుంచి బెంగళూరు జట్టు బలంగా ఉంది. అందులోనూ ఆ జట్టు కెప్టెన్ ప్రపంచ మేటి బాట్స్ మెన్ విరాట్ కోహ్లి. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు రాయల్ చాలెంజర్స్ ఒక్కసారి కూడా ట్రోఫీ అందుకోలేకపోయింది. ఆ జట్టును కోహ్లి అన్నీ తానై నడిపిస్తున్నాడు. ఇక ఈ సీజన్లో కోహ్లి వరుసగా విఫలం అవుతున్నాడు. అయితే ఆ లోటును పూడుస్తూ జట్టులో మరో ఛాంపియన్ అవతరించాడు. అతడే దేవదత్ పడిక్కల్. అతడు ఆడింది నాలుగు మ్యాచ్ లే అయినా ఐపీఎల్ లో మూడో హాఫ్ సెంచరీలు చేశాడు. నిజానికి పడిక్కల్ గత ఏడాదే బెంగళూరు జట్టులోకి వచ్చాడు. అయితే అతడు ఆడటానికి ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు. బెంగళూరు జట్టు ఓపెనర్ గా మామూలుగా పార్థివ్ పటేల్ బరిలోకి దిగేవాడు. అయితే అతడి స్థానంలో ఈ ఏడాది పడిక్కల్ ను ఓపెనర్ గా పంపడం మొదలు పెట్టారు. పడిక్కల్ వచ్చిన అవకాశాన్ని ఒడిసిపట్టుకుని కేవలం నాలుగు మ్యాచ్ లు ఆడి మూడు అర్ద సెంచరీలు సాధించాడు. దీంతో జట్టులో పడిక్కల్ ప్రధాన ఆటగాడిగా ఎదిగాడు. అతడి బ్యాటింగ్ లో దూకుడు, సంయమనం, నిలకడ కనిపిస్తున్నాయి.
జట్టు అవసరాలను బట్టి ఆటతీరులో గేర్లు మార్చుతూ ఆడుతున్నాడు. వరుసగా కొన్నేళ్ళ నుంచి పాయింట్ల పట్టికలో చివరి స్థానాల్లో ఉంటున్న బెంగళూరు జట్టు ఈ సారి టేబుల్ లో రెండవ స్థానంలో ఉండటానికి ఓ రకంగా పడిక్కల్ కారణమే. కెప్టెన్ కోహ్లి నమ్మకాన్ని వృథా కానివ్వకుండా పడిక్కల్ అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్ చరిత్రలో తొలి నాలుగు మ్యాచ్‌ల్లో మూడు అర్ధ సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా కూడా పడిక్కల్ అరుదైన రికార్డు సాధించాడు. దీంతో జట్టు సహచరులు, బెంగళూరు ఫ్యాన్స్ దేవదత్ ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. బెంగళూరు ఒక్కసారి అయినా ట్రోఫీ గెలవాలని కోహ్లి అభిమానుల కల. ఇప్పుడు కోహ్లికి అండగా పడిక్కల్ నిలుస్తుండడంతో టీంలో అతడు ప్రధాన ఆటగాడుగా మారిపోయాడు. మరో వైపు పడిక్కల్ ఓపెనర్ గా రాణిస్తుండడంతో జట్టుకు ఓపెనర్ల సమస్య కూడా తీరిపోయింది. అతడిలాగే రాణిస్తుంటే 20 ఏళ్ళకే జాతీయ జట్టుకు ఎంపిక కావడం పెద్ద కష్టం కూడా కాదని అభిమానులు భావిస్తున్నారు.