Begin typing your search above and press return to search.
ఏపీలో భూములపై రీసర్వే.. భూములకు భూధార్
By: Tupaki Desk | 3 Jun 2020 12:10 PM GMTతెలంగాణలో సత్ఫలితాలు ఇచ్చిన సమగ్ర భూసర్వేను ఏపీలోనూ చేపట్టాలని సీఎం జగన్ నిర్ణయించారు. ఈ మేరకు పాలనలో సంచలన నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఏపీలో 120 ఏళ్ల సుధీర్ఘ విరామం అనంతరం భూముల సమగ్ర రీసర్వేకు సీఎం జగన్ ఉత్తర్వులు జారీ చేశారు.
మనుషులకు ఆధార్ లాగానే భూములకు కూడా గుర్తింపు ఉండాలని జగన్ ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రతీ భూమిని గుర్తించి రైతుల భూములుకు ‘భూధార్ నంబర్’ను కేటాయించనున్నారు.
అత్యాధునిక కంటిన్యూయస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్) టెక్నాలజీతో భూములను రీసర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రతి భూమికి భూధార్ నంబర్ కేటాయించాలని ప్రభుత్వ రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఉషారాణి ఆదేశించారు.
ఈ సమగ్ర భూసర్వేను మొదట పైలెట్ ప్రాజెక్టుగా కృష్ణ జిల్లా జగ్గయ్యపేటలో తొలుత రీసర్వే చేయనున్నారు.ఈ ప్రాజెక్టు కోసం ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో రూ.200.15 కోట్లకు పరిపాలన ఆమోదం ఇవ్వాలని సర్వే సెటిల్ మెంట్ డైరెక్టర్ ప్రభుత్వాన్నికోరారు.