Begin typing your search above and press return to search.

బండి సంజయ్ కుమారుడు కొట్టినట్లుగా చెబుతున్న కుర్రాడు ఏం చెప్పాడు?

By:  Tupaki Desk   |   18 Jan 2023 5:34 AM GMT
బండి సంజయ్ కుమారుడు కొట్టినట్లుగా చెబుతున్న కుర్రాడు ఏం చెప్పాడు?
X
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడు బండి భగీరధ తాను చదివేకాలేజీలో శ్రీరాం అనే కుర్రాడిని కొట్టటం.. తన స్నేహితులతో కలిసి దాడి చేసినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియో సోషల్ మీడియాలోనూ.. వాట్సాప్ లోనూ.. టీవీల్లోనూ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. డిసెంబరులో జరిగిన ఈ ఉదంతం చాలా ఆలస్యంగా బయటకు రావటం ఒక ఎత్తు అయితే.. గొడవ జరిగి.. రాజీకి వచ్చినట్లుగా చెబుతున్న వేళలో.. ఈ వీడియోవైరల్ గా మారటం.. వర్సిటీకి చెందిన అధికారులు దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయటం.. ఇది కాస్తా రాజకీయం రంగు పులుముకోవటం తెలిసిందే.

తన కొడుకుపై కేసు నమోదు చేయటాన్ని తీవ్రంగా పరిగణించిన బండి సంజయ్.. సీఎం కేసీఆర్ మనమడి పై మరిన్ని వ్యాఖ్యలు చేశారు. పిల్లలు ఏదో చేసుకుంటే దానికి అంతలా చేస్తావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వేళ.. బండి సంజయ్ కొడుకు అతని స్నేహితులతో కలిసి దెబ్బలు తిన్న శ్రీరాం అనే విద్యార్థికి సంబంధించిన ఒక వీడియో ఇప్పడు బయటకు వచ్చి వైరల్ గా మారింది.

తనను భగీరధ ఎందుకు కొట్టాడు? తమ మధ్య ఏం జరిగిందన్న విషయంతో పాటు.. తాను మిస్ బిహేవ్ చేయటంతోనే దెబ్బలు తిన్నట్లు చెప్పాడు. అంతేకాదు..తామిప్పుడు పాత విషయాల్ని మర్చిపోయి.. కలిసి ఉన్నామని పేర్కొన్నాడు. దాదాపు ఒకటిన్నర నిమిషం నిడివి ఉన్న ఈ చిట్టి వీడియోలో ఉన్న శ్రీరాం ఏం చెప్పాడన్న విషయాన్ని అతడి మాటల్లోనే చూస్తే..

''నా పేరు శ్రీరాం. నేను భగీరధ్ వాళ్ల ఫ్రెండ్ వాళ్ల చెల్లితోని..రాత్రి నాలుగింటికి ఫోన్ చేసి లవ్ చేసి మిస్ బిహేవ్ చేశా. కాల్ చేశా. టెక్ట్స్ చేసిన. సో.. ఈ విషయం భగీరధ్ కు తెలీటం వల్ల భగీరధ్ వచ్చి.. నాతో మాట్లాడిండు. కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడిన. ఎక్కువ తక్కువ మాట్లాడినందువల్ల భగీరధ్ కొట్టిండు.

భగీరధ్ కొట్టిన తర్వాత జరిగిందేదో జరిగిందని.. ఇప్పుడు జరిగిన దాని గురించి పట్టించుకుంటే మనకేం వస్తుందని.. మేమంతా కలిసే ఉంటాం. మా మధ్యన ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. వాళ్లు కొట్టిందేదో కొట్టిండు. ఇప్పుడు అదంతా అయిపోయింది. మేం ఫ్రెండ్సే.. బ్యాచ్ మేట్స్.. దీన్నంతా మేం మర్చిపోయాం. ఆ వీడియో దేనికి పనికి రానిది. ఆ వీడియో ఒక యూజ్ లెస్ థింగ్'' అని పేర్కొన్నారు.

ఇదే వీడియోలో.. జరిగిన వ్యవహారం జరిగిపోయిందని.. ఇప్పుడు మళ్లీ ఆ వీడియోతో లొల్లి ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించాడు. ''అదంతా అయిపోంది. అదేదో జరిగిపోయి.. ఇప్పుడు అంతా మంచిగా ఉన్న తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉన్నది? మా మధ్యన విభేదాల్ని పెంచటానికి తప్పించి వీడియోలు దేనికి? విభేదాలు పెంచటానికే ఆ వీడియోలు పట్టుకొని బ్లాక్ మొయిల్ చేస్తారు. ఆ వీడియో ఎందుకు పనికి రాదు. మేం కలిసి ఉన్నామిప్పుడు. కలిసి లేమంటే ఆ వీడియో ఏదో పనికి వస్తుంది. కానీ.. కలిసి ఉన్నాం. ఆ వీడియో ఎందుకు పనికిరానిది'' అని స్పష్టం చేశారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.