Begin typing your search above and press return to search.

మాట జారి.. నోరు పారేసుకున్న దాయాది

By:  Tupaki Desk   |   26 Dec 2016 10:28 AM IST
మాట జారి.. నోరు పారేసుకున్న దాయాది
X
తప్పు చేయటం మామూలే. కానీ.. చేసిన తప్పును సరి చేసుకోవటంలోనే వారి సమర్థతను గుర్తించొచ్చు. తన అడ్డగోలు పద్దతులతో ఇష్టారాజ్యంగా వ్యవహరించే దాయాది తీరు మన విషయంలోనే కాదు.. చాలామంది విషయంలోనూ ఇలానే ఉంటుందన్న విషయాన్ని తెలియజెప్పే ఉదంతమిది. తప్పుడు మాటల్ని నమ్మి.. నోటికి వచ్చినట్లు మాట్లాడటమే కాదు.. తాము నోరు జారామని పలువురు చెప్పినా.. పట్టనట్లుగా ఉండటం దాయాదికి మాత్రమే చెల్లుతుందేమో..?

తాజాగా ఒక తప్పుడు వార్తను నమ్మిన పాక్ రక్షణ మంత్రి నోరు పారేసుకున్న వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. అవాద్ న్యూస్ డాట్ కామ్ అనే ఓ వెబ్ సైట్ ఇష్టారాజ్యంగా ఒక వార్తను వండేసింది. సిరియాకు పాక్ కానీ పదాతి దళాల్ని పంపిస్తే.. అణ్వాయుధాలతో ఆ దేశాన్ని నాశనం చేస్తామని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి చెప్పినట్లుగా ఒక వార్త ఉంది.

అయితే.. ఈ వార్త ఎంత తప్పన్న దానికి నిదర్శనం ఏమిటంటే.. ఆ వార్తలో పేర్కొన్న రక్షణ మంత్రి పేరు తప్పుగా కోట్ చేయటమే కాదు.. ఆ మాటతో తమకు సంబంధం లేదని ఇజ్రాయల్ పేర్కొంది. అయినప్పటికీ ఇవేమీ పట్టించుకోని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా మహమ్ముద్ ఆసిఫ్ ఇజ్రాయిల్ కు ఒక వార్నింగ్ ఇవ్వటం సంచలనంగా మారింది. తమది అణ్వాయుధ దేశమన్న విషయాన్ని ఇజ్రాయిల్ మర్చిపోయినట్లుగా ఉందంటూ ఆయనతాజాగా ట్వీట్ చేశారు.

ఆయన చేసిన ట్వీట్ తప్పని.. ఆయన నోరు జారినట్లుగా పలువురు రీట్వీట్ చేసినా.. పాక్ రక్షణ మంత్రి లైట్ తీసుకోవటం ఒక విశేషమైతే.. ఆ వార్తలో నిజం ఏమాత్రం లేదని ఇజ్రాయిల్ స్పష్టం చేసినా.. రక్షణ మంత్రి మాత్రం రియాక్ట్ కాకపోవటం చూస్తే.. దాయాది రక్షణ మంత్రి చర్మం మరీ ఇంత మందమా? అని పలువురు మండిపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/