Begin typing your search above and press return to search.
బూతుల మీద బహిరంగ చర్చకు సిద్ధమా?
By: Tupaki Desk | 21 Oct 2021 9:56 AM GMTఏపీ రాజకీయాలు మరీ గలీజు బూతులమయం అయిపోయాయి. వైసీపీ మంత్రులు ఇప్పటికే దీనిపై పేరు తెచ్చుకోగా.. తాజాగా టీడీపీ నేతలు తామేం తక్కువ కాదంటూ తొడగొట్టేస్తున్నారు. ఇటీవల టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి.. సీఎం జగన్ పై చేసిన బూతులు రచ్చకు దారితీశాయి. టీడీపీ ఆఫీసులు, నేతల ఇళ్లపై దాడుల వరకూ వ్యవహారం సాగింది. విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, సవాళ్లు, ప్రతిసవాళ్లతో ఇప్పుడు టీడీపీ వర్సెస్ వైసీపీ నేతల మాటల యుద్ధం ఏపీలో యమ రంజుగా సాగుతోంది.
వైసీపీ దాడులకు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష మొదలుపెట్టాడు. ఈ నిరసన దీక్షలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా పట్టాభి వ్యాఖ్యలను ఫోకస్ చేస్తూ వైసీపీ నేతలు ఆందోళన చేస్తున్నారు.. వైసీపీ నేతలు అంతకంటే దారుణమైన భాషను వాడారని.. తాము దాడులు చేశామా? అని ప్రశ్నించారు.
ఏపీ డ్రగ్స్ కేంద్రంగా మారుతోందనే ఆవేదనతోనే పోరాడుతుంటే దాడులకు దిగుతున్నారని అచ్చెన్న అసహనం వ్యక్తం చేశారు. మత్తు పదార్థాల వల్ల యువత చెడిపోతున్నారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర యువతను కాపాడడం కోసం ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై పోరాటం చేస్తున్నందుకు టీడీపీ నేతలపై దాడులు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా అమరులకు నివాళులర్పిస్తూ డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డీజీపీ తీరుతో ప్రాణత్యాగం చేసిన పోలీసుల ఆత్మఘోష పెడుతున్నారంటూ అచ్చెన్నాయుడు డీజీపీని టార్గెట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రెండున్నరేళ్లలో పోలీస్ వ్యవస్థను డీజీపీ భ్రష్టు పట్టించారని విమర్శించారు. సీఎం, డీజీపీ కలిసి కుట్ర పన్ని చంద్రబాబు నివాసంపై దాడికి యత్నించారని..ఇప్పుడు ఏకంగా టీడీపీ కార్యాలయంపై దాడులకు దిగారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
టీడీపీ నేతల ఆర్థికమూలాలను దెబ్బకొడూత వైసీపీ అరాచకం సృష్టిస్తోందని అచ్చెన్న ఫైర్ అయ్యారు. సమాజ చైతన్యం కోసమే చంద్రబాబు 36 గంటల దీక్ష చేపట్టారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
ఈ క్రమంలోనే అచ్చెన్నాయుడు సంచలన సవాల్ చేశారు. ‘జగన్, వైసీపీ నేతలు వాడిన బూతు పదజాలంపై బహిరంగ చర్చకు సిద్ధమా? చెప్పాలంటూ అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. వైసీపీ నేతల కంటే దారుణంగా తెలుగుదేశం నేతలు ఏనాడు మాట్లాడలేదని చెప్పుకొచ్చాడు.