Begin typing your search above and press return to search.
నన్ను కెలికితే అణు బాంబు వేస్తాను చూసుకోండి!
By: Tupaki Desk | 28 April 2022 1:30 AM GMTఅవసరమైతే అణ్వాయుధ ప్రయోగాలకు రెడీగా ఉన్నట్లు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చారు. ప్రపంచదేశాలకు వార్నింగ్ ఇచ్చినా ఉన్ టార్గెట్ మాత్రం ప్రధానంగా దాయాది దక్షిణ కొరియా, అమెరికా అని అందరికీ తెలిసిందే. అణ్వాయుధ పరంగా బలోపేతం అయ్యేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటామని స్పష్టంగా ప్రకటించారు. ఉత్తర కొరియా ఆర్మీ 90వ వ్యవస్థాపక దినోత్సవాలు జరిగాయి.
ఈ సందర్భంగా ఉన్ మాట్లాడుతూ తమను ఎవరైనా రెచ్చగొడితే కచ్చితంగా వారిపై అణ్వాయుధాలను ప్రయోగిస్తామని దక్షిణకొరియాను ఉద్దేశించి హెచ్చరించారు. ఈ పరేడ్ లో అత్యంత శక్తివంతమైన, అత్యాధునిక ఆయుధ సంపత్తిని ప్రదర్శించారు. ఒకవైపు తమను రెచ్చగొడితే అణ్వాయుధాలను ప్రయోగిస్తామని వార్నింగ్ ఇస్తునే మరోవైపు అణ్వాయుధాలను పెంచుకోవడం యుద్ధాన్ని నియంత్రించటం కోసమే అని చెప్పటమే విచిత్రం.
తమతో ఏ దేశమైనా గొడవకు దిగితే కచ్చితంగా అది అస్తిత్వాన్ని కోల్పోవడం ఖాయమన్నారు. తమ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవటం కోసం అత్యంత శక్తివంతమైన అణ్వాయుధాలను సమకూర్చు కుంటున్నట్లు చెప్పారు.
మిలిటరీ పరేడ్ లో అందరినీ ఆకర్షించింది మాత్రం హ్వాసంగ్-17 ఖండాతర క్షిపణి. ఈ క్షిపణిని ఉత్తరకొరియా మొన్నటి మార్చిలో ప్రయోగించింది. దీన్ని న్యూక్లియర్ వార్ టిటరెంట్ అని పిలుస్తారు.
2017లో ప్రయోగించిన హ్యాసంగ్ -15 కన్నా పెద్దది. ఈ బాలిస్టిక్ క్షిపణి 6 వేల కిలోమీటర్లకన్నా ఎక్కువ ఎత్తులో ప్రయాణించగలదు. ఇక్కడ గమనించాల్సిందేమంటే ఈ క్షిపణి పరిధిలో యావత్ అమెరికా కవర్ అయిపోతుందట. ఒకవైపు కరోనా వైరస్ తదితరాల కారణంగా దేశ ఆర్ధిక పరిస్ధితి ఎప్పటికప్పుడు దిగజారిపోతోందనే వార్తలు వస్తున్నాయి.
అయినా క్షిపణులు, అణ్వాయుధాల తయారీకి మాత్రం ఉన్ ఎలాంటి లోటు రాకుండా చూసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. 15 వేల కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించగల క్షిపణలను తయారుచేయటమే తమ టార్గెట్ గా ఉన్ ప్రకటించారు. అంటే అప్పటివరకు క్షిపణుల ప్రయోగాలు జరుగుతునే ఉంటాయన్నమాట.