Begin typing your search above and press return to search.
సుప్రీం తీర్పుపై ఉమా భారతి స్పందన ఇదే!
By: Tupaki Desk | 19 April 2017 11:30 AM GMTబాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ సీనియర్లకు షాకిచ్చేలా నేటి ఉదయం సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బీజేపీలో అంతర్గతంగా పెను తుఫాను లాంటి కలవరమే నెలకొంది. ఇదే అదనుగా నిన్నటిదాకా నోరు మూసుకుని కూర్చున్న విపక్షాలన్నీ ఒక్కసారిగా ముప్పేట దాడికి దిగాయి. సుప్రీం తీర్పుతోనైనా... ఈ కేసుతో సంబంధమున్న కేంద్ర మంత్రి ఉమా భారతి తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ కాస్తంత స్వరాన్ని గట్టిగానే వినిపించింది.
సుప్రీం తీర్పు - ఆ తర్వాత విపక్షాల దాడిపై బీజేపీ నేతలు ఏ ఒక్కరూ స్పందించకున్నా... ఈ కేసుతో ప్రత్యక్ష సంబంధం ఉన్న కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమా భారతి మాత్రం చాలా వేగంగానే కాకుండా కాస్తంత ఘాటుగానూ స్పందించారు. బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో విచారణకు మాత్రమే కాదు... అవసరమైతే ఉరి తీయించుకోవడానికి కూడా తాను సిద్ధమని ఆమె ప్రకటించారు. విచారణ రెండు గంటలు గడిచినా, రెండేళ్లు గడిచినా దాన్ని తాను ఎదుర్కొంటానని ఆమె కుండ బద్దలు కొట్టారు.
కోర్టు తీర్పు వచ్చిన తర్వాత తాను ఎవరితోనూ మాట్లాడలేదని, అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ రామ మందిరాన్ని నిర్మించాలనే తాను చెప్పాలనుకుంటున్నానని వ్యాఖ్యానించారు. తనను రాజీనామా చేయాలని అడిగే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. తిరంగా వివాదం సమయంలో తన మీద ఆరోపణలు రుజువయ్యాయి కాబట్టే తాను అప్పట్లో రాజీనామా చేశానన్నారు. తాను ఈ రోజు అయోధ్య వెళ్తానని, కాంగ్రెస్ ఆరోపణల మీద, తాను రాజీనామా చేయాలన్న వాళ్ల డిమాండు మీద మాత్రం స్పందించబోనని తెలిపారు. అసలు ఏ విషయమైనా చెప్పడానికి వాళ్లెవరని ఆమె ప్రశ్నించారు.
ఎమర్జెన్సీ విధించింది వాళ్లు, బలవంతంగా ముస్లింలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించింది వాళ్లు, 1984 మత ఘర్షణలకు కారణమైంది వాళ్లేనని ఉమాభారతి మండిపడ్డారు. రామ మందిరాన్ని తాము కట్టాలన్న విషయంలో ఎలాంటి అనుమానం లేదని, రామ మందిరం అంశం వల్లే తాము అధికారంలోకి వచ్చామని ఆమె చెప్పారు. ఎలాంటి తీర్పునైనా ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎలాంటి కుట్ర లేదని, అంతా బహిరంగంగానే ఉందని అన్నారు. తన ఉద్దేశం, చర్యలు అన్నీ ఒకటేనని, తాను రామమందిర ఉద్యమంలో పాల్గొన్నానని కూడా ఉమాభారతి చెప్పారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/