Begin typing your search above and press return to search.
చిత్రపురి సొమ్ముకు రియల్ కంపెనీలు శఠగోపం పెట్టాయట
By: Tupaki Desk | 1 July 2021 3:31 AM GMTమణికొండలోని చిత్రపురి హౌసింగ్ సొసైటీకి సంబంధించిన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. కారుచౌక ధరలకు సినీ కార్మికులకు ఇవ్వాల్సిన ఇళ్లను.. బడా బాబులకు.. పలుకుబడి ఉన్నవ్యక్తులకు ఇవ్వటం తెలిసిందే. ప్లాట్ల కేటాయింపులో తమకు తోచినట్లుగా మాయ చేసిన వైనం బయటకు వచ్చి సంచలనంగా మారింది. ఇదిలాఉంటే.. అప్పుడెప్పుడో మొదలైన ఇళ్ల నిర్మాణం.. ఇన్నేళ్లు ఎందుకు ఆగింది? సొంతింటి కలను నెరవేర్చుకోవటానికి సినీ కార్మికులు రూపాయి రూపాయి పోగేసిన డబ్బు ఇప్పుడు ఎక్కడ ఉంది? అన్నది ప్రశ్న.
దీనికి సమాధానం వెతికితే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. చిత్రపురి హౌసింగ్ సొసైటీ కింద నాలుగైదు రకాల ఇళ్లను నిర్మాణం చేయాలనుకోవటం తెలిసిందే. సింగిల్ బెడ్రూం మొదలు విల్లాల వరకు వివిధ విభాగాలు ఉన్నాయి. ఈ మొత్తం ప్రాజెక్టు విలువ రూ.723.8 కోట్లు కాగా.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సరిగా చెల్లించకపోవటం లాంటివి ఒక ఎత్తు అయితే.. ఇళ్ల నిర్మాణం కోసం నిర్మాణ రంగానికి చెందిన కొన్ని కంపెనీలకు అడ్వాన్సుల రూపంలో భారీ మొత్తం ఇవ్వటం ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మరింత షాకింగ్ విషయం ఏమంటే.. ఎక్కడైనా పని చేసిన తర్వాత డబ్బులు ఇస్తారు. చిత్రపురి యవ్వారంలో మాత్రం పని మొదలు పెట్టినంతనే అడ్వాన్స్ రూపంలో భారీ మొత్తాన్ని ఇచ్చేయటం.. ఆ నిధుల్ని సదరు నిర్మాణ సంస్థలు ఏం చేశాయో కానీ.. ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు.. డబ్బులు ఇవ్వకుండా పత్తా లేని పరిస్థితి. సింగిల్.. ట్రిపుల్ బెడ్రూం ఇళ్ల కోసం 2003లో ఒక నిర్మాణ సంస్థకు పనులు అప్పగించగా.. ఆ సంస్థ తాము పనులు చేయలేమని చేతులెత్తేసింది. దీంతో 2014లో అప్పటి పాలక మండలిలోని పలువురు సదరు నిర్మాణ సంస్థకు కొమ్ముకాశారన్న ఆరోపణ ఉంది.
ఆ సంస్థకు రూ.50 కోట్లు చెల్లించగా.. పనులు చేయకుండా ఐపీ పెట్టేయటంతో.. ఆ నిధుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. అంతేకాదు.. ఆ తర్వాత మరో మూడు నిర్మాణ సంస్థలు ఇళ్లు కట్టటానికి ముందుకు రావటం.. అడ్వాన్సు తీసుకొని చేతులు ఎత్తేయటం పరిపాటిగా మారింది. ఇలా మొత్తం రూ.90 కోట్లను తీసుకున్న కంపెనీలు ఇప్పుడు చేతులు ఎత్తేశాయి.
దీంతో.. చిత్రపురి సొసైటీ ఖాతాలో గుండు సున్నా వచ్చి చేరింది. చేతిలో చిల్లిగవ్వ లేకపోవటం.. బ్యాంకులకు కట్టాల్సిన అప్పులు తీర్చాల్సి వచ్చింది. ఓవైపు పూర్తి కాని నిర్మాణాలు.. మరోవైపు చేతిలో డబ్బులు లేని వైనంతో చిత్రపురి సొసైటీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వారు చెప్పినట్లే డబ్బులు కట్టి ప్లాట్ల కోసం ఎదురుచూస్తున్న వారి కళ్లు కాయలు కాచే పరిస్థితి. అంతకు మించి మరేమీ చేయలేక దిక్కుతోచని పరిస్థితిలో వారున్నారు.