Begin typing your search above and press return to search.

ఏపీలో పడిపోవటం.. తెలంగాణ ఊపు మీద దూసుకెళుతోంది

By:  Tupaki Desk   |   15 Jan 2022 5:30 PM GMT
ఏపీలో పడిపోవటం.. తెలంగాణ ఊపు మీద దూసుకెళుతోంది
X
సుడి ఉండాలే కానీ.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఆపలేరన్న మాటకు తగ్గట్లే ఉంది తాజాగా తెలంగాణ రాష్ట్ర పరిస్థితి. రాష్ట్రానికి అవసరమైన ఆదాయం వచ్చే మూడు..నాలుగు విభాగాల్లో అనూహ్యంగా పెరిగిన రాబడి.. తెలంగాణ ప్రభుత్వానికి ఉపశమనంగా మారటమే కాదు.. కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని చెబుతున్నారు. పక్కనున్న ఏపీలో రియల్ ఎస్టేట్ పడిపోవటం.. అక్కడి రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. ఏపీలో రియల్ వ్యాపారం మందగిస్తే.. అందుకు భిన్నంగా తెలంగాణలో మరింత ఊపందుకుంది.

ఈ వాదనకు నిదర్శనంగా తాజాగా జోరుగా సాగుతున్న భూ రిజిస్ట్రేషన్లుగా చెబుతున్నారు. తాజాగా నమోదవుతున్న దూకుడును చూసిన వారంతా.. ఈ ఏడాది రూ.10వేల కోట్లకు పైనే ఆదాయం వస్తుందని చెబుతున్నారు. కొత్త సంవత్సరం మొదలైన రెండు వారాల కంటే తక్కువ వ్యవధిలోనే.. భారీగా ఆదాయం రావటంతో.. ఈ ఆర్థిక సంవత్సరం ముగియనటానికి మరో రెండున్నర నెలలు ఉండటంతో.. ఈసారి రిజిస్ట్రేషన్ ఆదాయం రూ.10వేల కోట్లను టచ్ చేస్తుందని అంచనా వేస్తున్నారు.

జనవరి మొదటి వారానికే తెలంగాణ వ్యాప్తంగా జరిగిన రిజిస్ట్రేషన్లను చూసినప్పుడు.. ఇప్పటికే రూ.7759 కోట్ల రాబడి వచ్చినట్లుగా గుర్తించారు. ఇందులో ఒక్క డిసెంబరుఆదాయమే 1118 కోట్ల రూపాయిలుగా చెబుతున్నారు. వచ్చే మూడునెలలు కూడా ఆదాయం ఏ మాత్రం తగ్గదని.. దీంతో.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.12500 కోట్లు వచ్చే వీలుందని చెబుతున్నారు. నిజానికి గత ఏడాది ఏప్రిల్.. మే నెలల్లో కొవిడ్ కేసులు భారీగా పెరగటం.. ఆ సందర్భంగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోవటం వల్ల.. ఆదాయం తగ్గినట్లు చెబుతున్నారు.

సెకండ్ వేవ్ లేకుండా ఉండి ఉంటే.. ఈ ఆదాయం మరింత ఎక్కువగా ఉండేదంటున్నారు. దీనికితోడు ఏపీలోని రాజకీయ పరిస్థితులు కూడా తెలంగాణలో రియల్ బూమ్ కు సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. రాజధాని హైదరాబాద్ శివార్లు అంతకంతకూ విస్తరించటం.. అక్కడ పెద్ద ఎత్తున రియల్ వ్యాపారం పుంజుకోవటంతో రిజిస్ట్రేషన్ల భారీగా జరుగుతున్నాయని.. ప్రభుత్వానికికాసులు కురిపిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇటీవల కాలంలో తెలంగాణ వ్యాప్తంగా భూముల విలువ పెరగటం.. వ్యవసాయ భూములకు డిమాండ్ పెరగటంతో గ్రామీణ ప్రాంతాల్లోనూ గతంలో మాదిరి కాకుండా.. ఇప్పుడు రిజిస్ట్రేషన్లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అది కూడా.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరగటానికి సాయం చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏప్రిల్ లో రిజిస్రేషన్ల ఆదాయం రూ.617 కోట్లు ఉంటే.. మేలో కేవలం రూ.148 కోట్లు మాత్రమే ఉంది. అనంతరం జూన్ లో కాస్త పుంజుకొని రూ.628 కోట్లను నమోదు చేసింది. ఆ తర్వాత నెల అంటే.. జులైలో రిజిస్ట్రేషన్ల ఆదాయం ఏకంగా రూ.1062కోట్లకు చేరుకోవటం విశేషం.

ఆగస్టు.. సెప్టెంబరు. అక్టోబరులో కాస్తంత జోరు తగ్గినా.. గతంతో పోలిస్తే.. రిజిస్ట్రేషన్ల ఆదాయం పెరిగిందనే చెప్పాలి. నవంబరు డిసెంబరులలో వరుసగా రూ.1048, రూ.1119కోట్ల రిజిస్ట్రేషన్ల రాబడి వచ్చినట్లుచెబుతున్నారు.జనవరిలో మొదటి వారం గడిచినంతనే రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.387 కోట్లు ఉండటం చూస్తే.. మార్చి చివరి నాటికి భారీగా రాబడి పెరగటం ఖాయమంటున్నారు. ఏపీలో రియల్ రంగానికి దెబ్బ పడటం తెలంగాణలో పుంజుకోవటమే కాదు.. రిజిస్ట్రేషన్ల ఆదాయాన్ని పెంచినట్లు చెబుతున్నారు.