Begin typing your search above and press return to search.

పెట్టుబడులకు సరైన ఎంపిక 'రియల్ ఎస్టేట్'

By:  Tupaki Desk   |   11 Sep 2022 1:30 AM GMT
పెట్టుబడులకు సరైన ఎంపిక రియల్ ఎస్టేట్
X
జీవితంలో భవిష్యత్ అంతా హాయిగా బతకాలంటే ఏం చేయాలి? చేతిలో నాలుగు డబ్బులు ఉన్నప్పుడు నాలుగు ఆస్తులు కొని పెట్టుకోవాలి. సినిమాల్లో సంపాదించిన దాంతో నాడు హీరో శోభన్ బాబు నుంచి నేటి మురళీ మోహన్ వరకూ అదే చేశారు. ఇప్పుడు వారి కోట్ల ఆస్తులు వారికి చింత లేకుండా చేస్తాయి. దీర్ఘకాలంగా పెట్టుబడికి సరైనది ‘రియల్ ఎస్టేట్’ అనడంలో ఎలాంటి సందేహం లేదు. కరోనా వచ్చినా లాక్ డౌన్ పెట్టినా మొదట్లో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు మళ్లీ జోరందుకుంది. ప్రతి నలుగురిలో ముగ్గురు స్థిరాస్తిపైనే లాభసాటి అంటున్నారు.

దీర్ఘకాలానికి స్థిరాస్తిలో పెట్టుబడి పెట్టడం ద్వారా వచ్చే రాబడి మరేదేంట్లోనూ రాదని ‘ట్రాక్2 రియాలిటీ’ నిర్వహించిన తాజా సర్వేలో 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. అందుకే సొంత ఇల్లు ఉన్నా కూడా మరో ఇల్లు కొనుగోలు చేస్తున్నారు. బడ్జెట్ ను బట్టి విల్లాలు, ఓపెన్ ఫ్లాట్లు, ఫామ్ ల్యాండ్ల వరకూ స్థిరాస్థులు కొంటున్నారు. అద్దెలు వస్తాయని కొందరు.. దాంతోపాటు విలువ కూడా పెరుగుతుందని వీటిలో పెట్టుబడి పెడుతున్నారు.

హైదరాబాద్ లో అయితే సిటీలో ఇతర ప్రాంతాల్లో నివాసమున్న వారు సైతం పిల్లల కోసం ఐటీ కారిడార్ లో స్థిరాస్థులు కొనుగోలు చేస్తున్నాయి. ఇళ్లు ఇక్కడ ఒకింత ఖరీదే అయినా ఆస్తి విలువ సైతం అదే స్థాయిలో పెరుగుతుందని కొనుగోలు చేస్తున్నారని నిర్మాణదారులు చెబుతున్నారు.

మార్కెట్లో అత్యంత సురక్షిత పెట్టుబడి ఏంటంటే అది ‘రియల్ ఎస్టేట్’లో పెట్టుబడులే.. కళ్లముందు ఆస్తి ఉంటుందనే భరోసా ఎక్కువమందికి కలిగి ఇందులో పెడుతున్నారు. హైదరాబాద్ లాంటి చోట మార్కెట్లో ధరలు పెరగడమే తప్ప తగ్గడం ఇప్పటివరకూ ఉండదు. స్వల్పకాలంలోనూ ఒడిదొడుకులు తక్కువే ఉంటాయి. కొనుగోలుదారుల అభిప్రాయమూ ఇదే. ఆర్థిక మందగమనం వంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇబ్బందులు తక్కువ అని 82 వాతం మంది ఈ రియల్ ఎస్టేట్ వైపే మొగ్గుతున్నారు.

ద్రవ్యోల్బణాలు ఇతర సమీకరణాలతో సమీకరణాలేని రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి మేలని భావిస్తున్నారు. ఐదేళ్లు, పదేళ్లు వేచి ఉంటే అధిక రాబడి వస్తుంది. కొన్ని సార్లు ఒకటి , రెండేళ్లకే మంచి వృద్ధి కనిపిస్తుంది.

ఇక ప్రస్తుతం అప్పులు చేసి స్థిరాస్తులు కొనడానికి కొందరు తటపటాయిస్తున్నారు. ఎందుకంటే ఉద్యోగ భద్రతపై కొంత భయాందోళనలు నెలకొన్నాయి. 62 శాతం మందిలో ఈ భయాలు ఉన్నాయి. అందుకే చాలా మంది ధైర్యం చేసి ఆస్తులు కొనేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కొంతకాలం సరదాలకు దూరమై.. ఆర్థికంగా కష్టమైనా సరే చాలామంది సొంత ఇంటిని కలను నెరవేర్చుకునేందుకు ఆపసోపాలు పడి బాగా పనిచేస్తూ డబ్బులు సంపాదించి కొంటున్నారు. ఇంటి అద్దె, ఈఎంఐ భారాలు తగ్గించుకునేందుకు కొన్ని ఇంటిలోనే ఉండేలా చూసుకుంటున్నారు. పిల్లల విద్య, ఆరోగ్యం వంటి విషయాల్లో ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు.

స్థిరాస్తి కొనుగోలు చేసిన తర్వాత ఉద్యోగం పోతే.. వ్యాపారాల్లో నష్టం వస్తే ఈఎంఐ చెల్లించలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈఎంఐ వాయిదా వేసేలా చేస్తున్నాయి. ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఎదురైతే తిరిగి మరో ఉద్యోగం పొందే వరకూ ఆర్థికంగా కుదురుకునే వరకూ రెండేళ్లపాటు ఈఎంఐ చెల్లించకపోయినా ఎగవేతదారుగా భావించకుండా వెసులుబటు ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇలా వెసులుబాటు ఇవ్వాలని సూచిస్తున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.