Begin typing your search above and press return to search.

ఐటీ అయిపోయింది.. భ‌విష్య‌త్ ఉద్యోగాలివేన‌ట‌

By:  Tupaki Desk   |   5 Jun 2017 8:33 AM GMT
ఐటీ అయిపోయింది.. భ‌విష్య‌త్ ఉద్యోగాలివేన‌ట‌
X
ఒక‌ప్పుడు ఉద్యోగం అంటే.. బ్యాంకు ఉద్యోగ‌మో.. ప్ర‌భుత్వ ఉద్యోగ‌మ‌నే మాట ఉండేది. ఐటీ పుణ్యమా అని ప‌రిస్థితి మొత్తం మారిపోయింది. చివ‌ర‌కు.. ఐటీ ఉద్యోగాల ముందు ప్ర‌భుత్వ ఉద్యోగాలు ఎందుకు ప‌నికి రావ‌న్న‌ట్లుగా మారిపోయింది. అలాంటి ఐటీలో ఉన్న‌ట్లుండి వ‌చ్చి ప‌డే అప్ అండ్ డౌన్ల‌తోఉలిక్కిప‌డుతుండ‌టం తెలిసిందే.

అయితే.. ఇటీవ‌ల కాలంలో ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాల నేప‌థ్యంలో.. ఐటీ ఉద్యోగాల భ‌విష్య‌త్తు మీద నీలి నీడ‌లు క‌మ్ముకున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒక‌ప్పుడు ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించిన ఐటీ.. ఇప్పుడున్న ఉద్యోగుల్ని తొల‌గించేస్తున్నారు. ఆటోమేష‌న్ పుణ్య‌మా అని అంత‌కంత‌కూ ఐటీ ఉద్యోగాలు త‌గ్గుతున్న దుస్థితి.

2013లో దాదాపు 33 ల‌క్ష‌ల మందికి ఉపాధిని ఇచ్చిన ఐటీ.. గ‌డిచిన మూడేళ్ల‌లో ప‌ది ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే ఉపాధిని ఇవ్వ‌టం.. 2022 నాటికి మ‌రో 10 ల‌క్ష‌ల ఉద్యోగాలే ఐటీలో సాధ్య‌మ‌ని అసోసియేటెడ్ చాంబ‌ర్స్ ఆఫ్ కామ‌ర్స్ అండ్ ఇండ‌స్ట్రీస్ ఆఫ్ ఇండియా.. సింపుల్ గా అయితే అసోచామ్ త‌న తాజా నివేదిక‌లో వెల్ల‌డించింది.

తాజాగా థాట్ ఆర్బిట్రేజ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ అనే సంస్థ‌తో క‌లిపి చేసిన స‌ర్వే వివ‌రాల్ని ప్ర‌క‌టించింది. రానున్న రోజుల్లో ఐటీ స్థానే కొన్ని రంగాల్లో అద్భుత‌మైన వృద్ధి చోటు చేసుకోవ‌ట‌మే కాదు.. కొత్త కొత్త అవ‌కాశాల‌కు అవ‌కాశం ఉంటుంద‌ని పేర్కొంది.

ఫ్యూచ‌ర్లో లాజిస్టిక్స్‌.. ర‌వాణా.. బ్యూటీ అండ్ వెల్ నెస్‌.. రియ‌ల్ ఎస్టేట్ రంగాల్లో అత్య‌ధిక జాబ్స్ ర‌వ‌టం ఖాయ‌మ‌ని పేర్కొంది. టెక్నాల‌జీ అప్ గ్రేడేష‌న్‌.. వీసాల స‌మ‌స్య‌ల కార‌ణంగా ఐటీ ఉద్యోగాలు అనుకున్న రీతిలో ఉండ‌వ‌ని పేర్కొంది.

దేశంలో ఏటా కోటి నుంచి కోటిన్న‌ర‌దాకా ఉద్యోగ అవ‌కాశాల్ని క‌ల్పించాల్సి ఉండ‌టంతో ఎగుమ‌తులు.. దేశీయ మార్కెట్ మీదా దృష్టి పెట్టాల్సి వస్తుంద‌ని అసోచామ్ సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ రావ‌త్ చెబుతున్నారు. భ‌వ‌న‌నిర్మాణ రంగం.. రియ‌ల్ ఎస్టేట్ రంగంలో 2013 నాటికి 4.54 కోట్ల ఉద్యోగ అవ‌కాశాలు ఏర్ప‌డ్డాయ‌ని.. రానున్న రోజుల్లో మ‌రో 3.11 కోట్ల ఉద్యోగాల క‌ల్ప‌న ఉంటుంద‌ని చెప్పుకొచ్చారు. రిటైలింగ్ రంగంలోనూ 1.2 కోట్ల ఉద్యోగాల‌కు అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేసింది. వ‌స్త్ర ప‌రిశ్ర‌మ‌లోనూ భారీ ఎత్తున ఉపాధి అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా పేర్కొంది. సో.. ఐటీ లేకున్నా చాలానే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న విష‌యాన్ని అసోచామ్ చెప్పింద‌ని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/