Begin typing your search above and press return to search.
రియల్ ఎస్టేట్ రంగంలో హైదరాబాద్ ‘దూకుడు’..!
By: Tupaki Desk | 13 Jan 2023 12:30 AM GMTరెండేళ్లుగా కరోనాతో ప్రపంచం సతమతం అయింది. ఈ కాలంలో చాలా రంగాలు కుదేలయ్యాయి. ఇందులో రియల్ ఎస్టేట్ రంగం కూడా ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం దేశంలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తన నివేదికలో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఉన్న 8 ప్రధాన నగరాల్లో హైదరాబాద్ మూడో ప్లేస్ ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ సీనియర్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ తెలిపారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ లో అద్దెకు తీసుకోవడం చాలా పెరిగిపోయింది. కో వర్కింగ్.. బీఎఫ్ ఎస్ఐ విభాగాలు ఇందులో ముందున్నాయి. గతేడాది హైదరాబాద్ స్థిరాస్తి విభాగంలో వాణిజ్య స్థలం వినియోగం 12 శాతం పెరిగిందని వెల్లడైంది. సుమారు 67 లక్షల చదరపు అడుగుల నిర్మాణ స్థలాన్ని కంపెనీలు అద్దెకు తీసుకున్నట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.
హైదరాబాద్‌లో చదరపు అడుగుల నిర్మాణ స్థలానికి సగటు అద్దె రూ. 65గా ఉందని పేర్కొంది. 2021 ఏడాదితో పోలిస్తే ఇది ఆరు శాతం అధికమని పేర్కొంది. ఇక నివాస గృహాల్లోనూ 2021లో హైదరాబాద్‌లో 43వేల 847 కొత్త ఇళ్ల నిర్మాణం ప్రారంభమైనట్లు వెల్లడించింది. వీటిలో 31వేల46 కొత్త ఇళ్ల అమ్మకాలు జరిగినట్లు నైట్ ఫ్రాంక్ ఇండియా పేర్కొంది.
2021 తో పోలిస్తే కొత్త ఇళ్ల నిర్మాణంలో 22.7శాతం.. ఇళ్ల అమ్మకాల్లో 27.7 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. నివాస గృహాలు చదరపు అడుగుల సగటు ధర 2021 తో పోలిస్తే 5.6 శాతం పెరిగి రూ.4984 కు చేరినట్లు పేర్కొంది. ముఖ్యంగా నగరంలోని హైటెక్ సిటీ.. కొండాపూర్.. కూకట్‌పల్లి.. రాయదుర్గం.. మణికొండ తదితర ప్రాంతాల్లో కార్యాలయాలకు గిరాకీ ఉందని తెలిపింది.
నివాసాల విషయానికొస్తే గండిపేట.. తెల్లాపూర్.. కొల్లూరు.. నార్సింగ్‌లలో ఎక్కువ ఆదరణ ఉన్నట్లు వెల్లడించింది. ఈ ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు ఎక్కువగా వస్తున్నట్లు పేర్కొంది. స్థిరాస్తి విభాగంలో హైదరాబాద్ కు ఐటీ రంగమే ఒక ఇంధనంగా ఉందని నైట్ ఫ్రాంక్ ఇండియా హైదరాబాద్ బ్రాంచ్ సీనియర్ డైరెక్టర్ శామ్సన్ ఆర్థర్ వివరించారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.