Begin typing your search above and press return to search.

పారిశ్రామిక శ్రీ‌మంతుడి సేవ‌లు వింటే ఫిదా!

By:  Tupaki Desk   |   10 Jan 2018 10:45 AM GMT
పారిశ్రామిక శ్రీ‌మంతుడి సేవ‌లు వింటే ఫిదా!
X
సంప‌ద‌ను చాలామంది సృష్టిస్తారు. కానీ.. కొంద‌రు సృష్టించిన సంప‌ద‌కే విలువ ఉంటుంది. చేసే ప‌నిని నిబ‌ద్ధ‌త‌తో చేయ‌టంతో పాటు.. నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ లేకుండా ప్రాజెక్టుల మీద ప్రాజెక్టుల్ని పూర్తి చేస్తూ దూసుకెళుతున్న మౌలిక స‌దుపాయాల సంస్థ‌ల్లో ఒక‌టి.. మేఘా ఇంజ‌నీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చ‌ర్ లిమిటెడ్‌. రెండు తెలుగు రాష్ట్రాల్లోని పారిశ్రామిక‌.. రాజ‌కీయ రంగాల వారికి మేఘాగా సుప‌రిచ‌తులైన ఈ సంస్థ అధినేత‌లు తీరు స్ఫూర్తివంత‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వ్యాపారం విష‌యంలో ప‌క్కాగా ఉంటార‌న్న పేరున్న మేఘా అధినేత‌ల‌కు సంబంధించి నాణెనికి రెండో కోణం ఆస‌క్తిక‌ర‌మ‌ని చెప్పాలి. పుట్టిన ఊరికి ఏదో ఒక‌టి చేయాల‌ని అనుకోవ‌టంతో ఆగ‌కుండా.. ఎంత చేసినా ఇంకా ఏదో చేయాల‌ని త‌పించే త‌త్త్వం వారి సొంతం.

త‌మ స్వ‌గ్రామ‌మైన కృష్ణా జిల్లా గుడ్ల‌వ‌ల్లేరు మండ‌లం డొకిప‌ర్రు గ్రామానికి సంబంధించి ఇప్ప‌టికే ప‌లు అభివృద్ధి కార్య‌క్ర‌మాల్నిచేప‌ట్టిన వారు తాజాగా ప్ర‌జ‌ల‌కు సుర‌క్షిత తాగునీటిని అందించాల‌న్న కృత‌నిశ్చ‌యంతో ఒక కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఇందుకోసం రూ.4కోట్ల రూపాయిల్ని ఖ‌ర్చు చేయ‌టం గ‌మ‌నార్హం.

మేఘా సంస్థ‌ల అధినేత‌లైన పిపి రెడ్డి.. పీవీ కృష్ణా రెడ్డిలు క‌లిసి డోకిప‌ర్రులో రెండు ల‌క్ష‌ల లీట‌ర్ల సామ‌ర్థ్యం క‌లిగిన మంచినీటి ట్యాంకును ఏర్పాటు చేశారు. దీంతో పాటు 1500 ఇళ్ల‌కు మంచినీటి కుళాయిల్ని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించిన పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. ఈ నెల 14న వీటిని ప్రారంభించ‌నున్నారు.

గ‌తంలో గ్రామ పంచాయితీ నిర్మించిన ఓవ‌ర్ హెడ్ ట్యాంక్ కు అవ‌స‌ర‌మైన రిపేర్లు చేయించ‌ట‌మే కాదు.. వీధుల్లోని కుళాయిల్లోనూ సుర‌క్షిత మంచినీరు వ‌చ్చే ఏర్పాటు చేశారు.

గ‌తంలో ఇదే గ్రామంలో వెంక‌టేశ్వ‌ర‌స్వామి దేవాల‌యాన్ని నిర్మించ‌టంతో పాటు దానికి అనుబంధంగా క‌ల్యాణ మండ‌పాన్ని నిర్మించారు. స్థానికులు ఉచితంగా పెళ్లిళ్లు చేసుకోవ‌టానికి అనుకూలంగా ఇస్తున్నారు. గ్రామంలోని ఎస్టీ కాల‌నీ ప్ర‌జ‌ల ఇబ్బందుల్ని తొల‌గించేందుకు వీలుగా రూ.50ల‌క్ష‌ల ఖ‌ర్చుతో సీఎస్ ఆర్ ప‌థ‌కం కింద బ్రిడ్జిని నిర్మిస్తున్నారు. గ్రామంలోని అన్ని వీధుల్లో ఎల్ ఈడీ లైట్ల‌ను ఏర్పాటు చేయ‌ట‌మే కాదు.. స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మంలో భాగంగా 700 గృహాల‌కు మ‌రుగుదొడ్ల‌ను ఏర్పాటు చేశారు.సొంతూరుతో పాటు తోట్ల‌వ‌ల్లూరు మండ‌లం భ‌ద్రారాజుపాలెంలో సుర‌క్షిత మంచినీటి ఏర్పాటుతోపాటు.. మొవ్వ మండ‌లం కాజ గ్రామంలోస్వ‌చ్ఛ భార‌త్ ప‌థ‌కం కింద ఉచితంగా రెడీమేడ్ మ‌రుగుదొడ్ల‌ను నిర్మిస్తున్నారు. ఇలా.. తాము చేయ‌గ‌లిగిన స్థాయిలో అభివృద్ధి ప‌నులు చేసుకుంటూ వెళుతున్న వారు.. తాము చేస్తున్న సామాజిక సేవ వివ‌రాల్ని పెద్ద‌గా ప్ర‌చారం చేసుకోక‌పోవ‌టం గ‌మ‌నార్హం.