Begin typing your search above and press return to search.
రీల్ కు మించిన రియల్ సస్పెన్స్ థ్రిల్లర్.. కిడ్నాప్ ను ఛేదించింది
By: Tupaki Desk | 8 Aug 2022 6:33 AM GMTతెర మీద కనిపించే రీల్ స్టోరీకి మించిన బోలెడన్ని ట్విస్టులు కొందరి రియల్ లైఫ్ లో కనిపిస్తుంటాయి. ఇప్పుడు చెప్పే ఉదంతం ఆ కోవకు చెందింది. ఏడేళ్ల వయసులో కిడ్నాప్ అయి... ఆ తర్వాత ఆ విషయమే తెలీక.. దాదాపు తొమ్మిదేళ్లు గడిచిన తర్వాత నిజం తెలిసి.. తన అసలు తల్లిదండ్రుల కోసం ఒక టీనేజర్ చేసిన ప్రయత్నం చూసినప్పుడు రియల్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీని తలపించేలా చేస్తుందని చెప్పాలి. ఈ ఉదంతంలో కిడ్నాప్ కు గురైన అమ్మాయే.. తన కిడ్నాప్ స్టోరీని డీల్ చేయటం మరో విశేషంగా చెప్పాలి.
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం అంటే 2013లో ముంబయిలోని అంధేరిలో ఏడేళ్ల పూజ తన సోదరుడితో కలిసి స్కూల్ కు వెళ్లింది. అక్కడ ఐస్ క్రీం ఆశ చూపించి హెన్రీ జోసెఫ్ డిసౌజా అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడు. అనంతరం బెంగళూరు తీసుకొచ్చి ఆమె పేరును అన్నె డిసౌజాగా మార్చాడు. ఆ పాపను కర్ణాటకలోని ఒక హాస్టల్ లో చేర్పించారు. ఇదిలా ఉండగా.. అప్పటివరకు పిల్లలు లేని ఆ దంపతులకు బిడ్డ పుట్టింది. దీంతో.. ఇంట్లో పని చేయించటం కోసం పూజను ఇంటికి తీసుకొచ్చి పని చేయించేవారు. సరిగా చూసేవారు కాదు.
ఇదిలా ఉండగా ఒక రోజు ఫుల్ గా తాగేసిన మైకంలో పూజకు.. ఆమెకు సంబంధించిన అసలు రహస్యాన్ని చెప్పేశాడు. ఆమె తమ బిడ్డ కాదని.. తాను కిడ్నాప్ చేసినట్లుగా చెప్పాడు. ఇలా అన్నివివరాల్ని తెలుసుకున్న పూజ అలియాస్ అన్నే డిసౌజా.. తన తల్లిదండ్రుల్ని వెతికే ప్రయత్నం చేసింది. ఇందులో భాగంగా గూగుల్ లో పూజా మిస్సింగ్ పేరుతో పెద్ద ఎత్తున సెర్చ్ చేసింది. ఈ సందర్భంగా ఆమెకు తనను పోలి ఉన్న ఫోటోతో ఉన్న మిస్సింగ్ ప్రకటన కనిపించింది. అందులో ఐదు నెంబర్లు ఉన్నాయి.
దీంతో తెగ సంతోషపడిన ఆమెకు ఫోన్ నెంబర్లు షాకిచ్చాయి. తన మిస్సింగ్ పోస్టర్లో ఉన్న ఐదు నెంబర్లలో నాలుగు నెంబర్లు పని చేయలేదు. చివరి నెంబర్ పని చేయటం.. ఫోన్ ఎత్తిన వ్యక్తి తన గురించి చెప్పి.. తన కథనంతా చెప్పింది. ఆ నెంబరు మరెవరిదో కాదు పూజ ఇంటికి సమీపంలో నివసించే రఫీక్. వెంటనే.. అతగాడు షాక్ తిని.. వారి ఇంట్లో వారి చేత పూజకు వీడియో కాల్ చేశారు. ఆమె తల్లి పూజను గుర్తించింది. ఇలా తల్లీకూతుళ్లు మొబైల్ స్క్రీన్ మీద చూసుకొని భావోద్వేగానికి గురయ్యారు.
అనంతరం పాప కిడ్నాప్ అయిన కేసు వివరాలతో పాటు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నది తెలియజేయటంతో పోలీసులు రంగంలోకి దిగారు. బెంగళూరుకు వెళ్లి ఆమెను రెస్య్కూ చేశారు. దీంతో పూజ కుటుంబం ఫుల్ హ్యాపీగా ఫీలైంది. ఇక.. పూజను కిడ్నాప్ చేసిన డిసౌజా దంపతులు ఇద్దరి మీదా కిడ్నాప్ ఆరోపణలతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
తన మూలాల గురించి తనకు తానే శ్రమించి.. తమ వారికి సొంతమైంది పూజ. ఏమైనా ఇలా తనకు తానుగా సొంతంగా ఆలోచించి.. తన సమస్యను తానే పరిష్కరించుకున్న పూజను అభినందించాలి. విషాదకరమైన విషయం ఏమంటే.. పూజ అసలు తండ్రి ఆమెకిడ్నాప్ అయిన కొంతకాలానికే కాలం చెల్లారు. అదొక్కటే ఆమెకు లోటుగా చెప్పాలి.