Begin typing your search above and press return to search.

ఇతగాడు రియల్ విక్కీ డోనార్

By:  Tupaki Desk   |   15 Jan 2016 5:56 AM GMT
ఇతగాడు రియల్ విక్కీ డోనార్
X
ఆ మధ్యన బాలీవుడ్ లో ఒక చిత్రమైన కథతో ఒక సినిమా వచ్చింది. వీర్యాన్ని దానం చేసే హీరో కథాంశంతో.. ‘విక్కీ డోనార్’ అన్న సినిమా వచ్చింది. ఈ సినిమా చివర్లో.. తన వీర్యంతో కృత్రిమ గర్భం దాల్చిన పిల్లల్ని ఒకచోట కనిపిస్తారు. ఇలాంటివి నిజంగా ఉంటాయా? అన్న సందేహం కలుగుతుంది. అలాంటి డౌట్లు ఉన్నోళ్లకు బ్రిటన్ కు చెందిన సైమన్ వాట్సన్ ను చూపిస్తే సరి.

41 ఏళ్ల వయసున్న వాట్సన్.. తన 16 ఏట నుంచి వీర్యాన్ని దానం చేస్తుంటాడు. సంతానం కలగని దంపతులకు తన వీర్యాన్ని అందించి.. కృత్రిమ పద్ధతిలో అండాన్ని ఫలదీకరణ జరిపి.. పిల్లల్లేని జంటలకు తల్లిదండ్రులయ్యే అవకాశాన్ని కల్పిస్తుంటారు. ఇలా అతగాడు ఇప్పటివరకూ ఏ పది మందికో.. ఇరవై మందికో కాదు.. ఏకంగా 800 మంది పిల్లలు పుట్టేందుకు కారణమయ్యారు. ఇన్ని వందల మంది పిల్లలు పుట్టటానికి కారణమైన వాట్సన్ కు ఒక లక్ష్యం ఉంది.

అదేమంటే.. రానున్న నాలుగేళ్లలో తన వీర్యం ద్వారా.. కృత్రిమ పద్ధతిలో పుట్టే పిల్లల సంఖ్య వెయ్యికి చేర్చాలని బలంగా కోరుకుంటున్నాడు. ఇందుకోసం తన వంతు కష్టం తాను పడుతున్నాడు. ఫేస్ బుక్ ను వేదికగా చేసుకొని ఇతగాడు తన వీర్యదానం కోసం ప్రచారం చేస్తుంటారు. తన వీర్యానికి 50 పౌండ్స్ వసూలు చేసే ఇతగాడు.. తానెంత ఆరోగ్యవంతుడ్ని అన్న విషయాన్ని కూడా ఎలాంటి సందేహాలు కలగకుండా చాలానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సినిమాల్లో చూసి చాలానే విషయాలు సాధ్యమేనా? అనుకుంటామే కానీ.. కొన్ని మాత్రం సాధ్యమేనని వాట్సన్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది.