Begin typing your search above and press return to search.
కేటీఆర్ వద్దకు రియల్టర్ల క్యూ.. సీట్ల కోసం ఒత్తిడి
By: Tupaki Desk | 7 Jan 2020 10:57 AM GMTతెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేళ నోటిఫికేషన్ రావడంతో రాజకీయ వేడి రగులుకుంది. ప్రధానంగా హైదరాబాద్ లో మేయర్ సీటు హాట్ కేకుగా మారింది. ఈ సీటును దక్కించుకునేందుకు రియల్టర్లు రంగంలోకి దిగుతున్నారు. బిల్డర్లు, వ్యాపారవేత్తలు సైతం హైదరాబాద్ పరిధిలోని మేయర్, మున్సిపల్ చైర్మన్ల సీట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
హైదరాబాద్ తోపాటు నగర శివారు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఇప్పుడు రియల్ భూమ్ నెలకొంది. హైదరాబాద్ చుట్టూ ప్రస్తుతం 7 కార్పొరేషన్లు, 7 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నారు. అమరావతి రాజధాని మార్పుతో హైదరాబాద్ లో భూముల ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో ఎలాగైనా సరే మేయర్ పీఠం దక్కించుకుంటే తమ పంట పండుతుందని అందరూ ప్రయత్నాలు ప్రారంభించారట..
ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో మేయర్, మున్సిపల్ చైర్మన్లు టికెట్ల వ్యవహారాలను కేటీఆర్ పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యేల ద్వారా పరిచయాల ద్వారా ఆయనను సంప్రదించడానికి రియల్టర్లు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.
హైదరాబాద్ శివారు బడంగ్ పేట, జవహర్ నగర్, నిజాంపేట, బండ్లగూడ, బోడుప్పల్ కార్పొరేషన్లలో టికెట్ల కోసం కేటీఆర్ వద్దకు క్యూ కడుతున్నారు. తాజాగా ఫీర్జాదిగూడ కార్పొరేషన్ అభ్యర్థిగా ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖ బిల్డర్ పోటీ పడుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి కేటీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం. డిమాండ్ భారీగా ఉండడంతో కేటీఆర్ ఆచితూచి సీట్లను కేటాయిస్తున్నారని తెలిసింది.