Begin typing your search above and press return to search.
ఏపీలో ఆగిన ఆరోగ్య శ్రీ సేవలు.. కారణం ఇదే
By: Tupaki Desk | 19 Aug 2019 7:47 AM GMTఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు ఆగాయి. దీంతో.. రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సిన శస్త్రచికిత్సలు పాక్షికంగా నిలిచిపోయాయి. సర్వర్ సమస్య కారణంగా గడిచిన మూడు రోజులుగా శస్త్రచికిత్సలు.. ప్రీ ఆథరైజేషన్లు.. డిశ్చార్జులు ఆగాయి. దీంతో నెట్ వర్క్ ఆసుపత్రుల్లో కొత్త రోగుల్ని చేర్చుకునేందుకు అనుమతులు లభించటం లేదు. అదే సమయంలో ఇప్పటికే శస్త్రచికిత్సలు పూర్తి అయి.. డిశ్చార్జ్ కావాల్సిన పేషంట్లను ఆసుపత్రులు డిశ్చార్జ్ కావటానికి అంగీకరించటం లేదు.
కొద్ది రోజుల క్రితం ఆరోగ్య శ్రీ ట్రస్టులో సాఫ్ట్ వేర్ మార్పులు చేయటం జరిగింది. ఆ తర్వాత నుంచి ట్రస్ట్ అధికారులు కొత్త సర్వరును అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే..సాంకేతిక సమస్యల కారణంగా మూడు రోజులుగా వైద్య సేవలు నిలిచిపోయాయి. గతంలో రోజుకు 40 వరకు ప్రీ అథరైజేషన్లు తీసుకునే ఆసుపత్రులు ఇప్పుడు కేవలం రోజుకు రెండు.. మూడు మాత్రమే తీసుకుంటున్నారు.
ఇప్పుడున్న నిబంధనల ప్రకారం రోగుల వేలిముద్రల్ని బయోమెట్రిక్ ద్వారా తీసుకున్న తర్వాతే డిశ్చార్జ్ చేయాల్సి ఉంటుంది. కానీ.. అందుకు ఇబ్బందులు ఎదురుకావటంతో వారంతా చికిత్స అనంతరం ఆసుపత్రుల్లోనే ఉంటున్నారు. మరోవైపు.. అత్యవసర కేసులకు వెనువెంటనే శస్త్రచికిత్సలు చేయాల్సి ఉంది. కానీ.. సర్వర్ సమస్య కారణంగా జరగటం లేదు.
దీంతో.. ఈ విషయాన్ని గుర్తించిన అధికారులు.. సర్వర్ ఇష్యూ తీరే వరకూ అత్యవసర శస్త్రచికిత్సలకు ఫోన్లో మౌఖింగా అనుమతులు ఇస్తామని సమాచారం ఇచ్చారు. దీంతో.. శస్త్రచికిత్సలు చేస్తున్నారు. అయితే.. జరగాల్సినంత వేగంగా శస్త్రచికిత్సలు జరగటం లేదు. సర్వర్ సమస్య పరిష్కారం అయ్యే వరకూ ఈ ఇబ్బంది తప్పదంటున్నారు. సాంకేతిక సమస్యను అధిగమించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.