Begin typing your search above and press return to search.

కేసీఆర్‌ పై అమిత్ షా నిప్పులు.. భారీ డ్రామానా?

By:  Tupaki Desk   |   17 Sep 2018 4:07 AM GMT
కేసీఆర్‌ పై అమిత్ షా నిప్పులు.. భారీ డ్రామానా?
X
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల నోళ్ల‌ల్లో నుంచి ఎలాంటి మాట‌లు రావాలో.. స‌రిగ్గా అలాంటి మాట‌ల్నే మాట్లాడిన బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా సంచ‌ల‌నం సృష్టించారు. స్నేహితుడా.. స్నేహితుడా.. ర‌హ‌స్య స్నేహితుడా అన్న సూప‌ర్ హిట్ పాట‌ను మోడీషా.. కేసీఆర్ లు క‌లిసి పాడుకుంటున్నార‌న్న ప్ర‌చారం జోరుగా సాగుతున్న వేళ‌.. తెలంగాణ రాష్ట్రానికి వ‌చ్చిన అమిత్ షా.. అందుకు భిన్నంగా విరుచుకుప‌డ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల కాలంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను ఉద్దేశించి ఈ స్థాయిలో తీవ్రంగా విమ‌ర్శించిన వారిలో అమిత్ షా నే ముందుంటారు. కేసీఆర్‌ పై ఇంత ఘాటు వ్యాఖ్య‌లు చేసిన త‌ర్వాత‌.. టీఆర్ ఎస్ అధినేత రియాక్ట్ అవుతార‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మైంది. అలా చేస్తే.. ఆయ‌న కేసీఆర్ ఎందుకు అవుతార‌న్నట్లుగా గులాబీ బాస్ అస్స‌లు రియాక్ట్ కాలేదు.

ఇదిలా ఉంటే.. తెలంగాణ‌లో ఇంత తీవ్ర‌స్థాయిలో అమిత్ షా ఎందుకు రియాక్ట్ అయిన‌ట్లు? కేసీఆర్ ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్య‌ల వెనుక అస‌లు కార‌ణం ఇంకేదైనా ఉందా? అన్న‌ది ఇప్పుడు క్వ‌శ్చ‌న్ గా మారింది. కేసీఆర్‌ పై షాకింగ్ వ్యాఖ్య‌ల వెనుక భారీ వ్యూహ‌మే ఉంద‌న్న మాట ఇప్పుడు వినిపిస్తోంది.

అమిత్ షా మాట‌ల్ని జాగ్ర‌త్త‌గా గమనిస్తే .. కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ‌టం క‌నిపిస్తుంది.. ఇంత తీవ్రంగా ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ముఖ్య‌నేత విరుచుకుప‌డింది లేదు. ఎందుకిలా అన్న దానిపై ఆస‌క్తిక‌ర వాద‌న వినిపిస్తోంది. అదేమంటే.. టీఆర్ ఎస్ వ్య‌తిరేక ఓటే ల‌క్ష్యంగా మ‌హాకూట‌మి అడుగులు వేస్తోంది. ఇవాళ కాకున్నా రేప‌టికైనా కూట‌మి రియాలిటీలోకి రావ‌టం ఖాయం. దాని ల‌క్ష్య‌మే.. కేసీఆర్ వ్య‌తిరేక ఓటును చీల్చ‌కుండా చేయ‌టం.

అయితే.. అమిత్ షా వ్యాఖ్య‌ల్ని చూసిన త‌ర్వాత‌.. రానున్న రోజుల్లో ఈ తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. కాంగ్రెస్ కు మించిన‌ మోతాదుతో కేసీఆర్‌ పై విరుచుకుప‌డే షా.. కారు వ్య‌తిరేకుల ఓట్ల‌ను త‌న ఖాతాలోకి మ‌ళ్లించుకోవ‌టం ద్వారా కాంగ్రెస్ ను దేబ్బేస్తార‌ని.. అంతిమంగా కారు పార్టీని ఖుషీ చేస్తార‌ని చెబుతున్నారు. ఈ వ్యూహంలో భాగంగానే.. అమిత్ షా అన్నేసి తిట్లు తిట్టిన త‌ర్వాత కూడా కేసీఆర్ నోట నుంచి షాపై ఖండ‌న ప్రెస్ మీట్ పెట్ట‌టం లేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.