Begin typing your search above and press return to search.

అమిత్ షా...ఆ జిల్లాలోనే టూర్ ఎందుకో!

By:  Tupaki Desk   |   12 May 2017 10:24 AM GMT
అమిత్ షా...ఆ జిల్లాలోనే టూర్ ఎందుకో!
X
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా తెలుగు రాష్ర్టాల ప‌ర్య‌ట‌న ఖరారైంది. ఆప‌రేష‌న్ సెవ‌న్ స్టేట్స్‌ లో భాగంగా ఏపీ - తెలంగాణ‌కు రానున్న అమిత్ షా ఈ టూర్‌ లో మొద‌ట తెలంగాణ‌ను ఎంచుకున్నారు. అమిత్ షా పర్యటన ఖరారైందని, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్ తెలిపారు. ఈ నెల 22 - 23 - 24 తేదీల్లో మూడు రోజుల పాటు అమిత్‌ షా తెలంగాణలో పర్యటిస్తారని ఆయ‌న వివ‌రించారు. త‌న పర్యటనలో భాగంగా అన్ని జిల్లాల అధ్యక్షులతో, ఆఫీస్ బేరర్లతో ఆయన సమావేశమవుతారని లక్ష్మణ్‌ చెప్పారు.

అమిత్‌ షా పర్యటన నేపథ్యంలో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ..“ఈ ప‌ర్య‌ట‌న త‌ర్వాత తెలంగాణ రాజకీయ ముఖచిత్రం మారటం ఖాయం. బీజేపీలో చేరికలు నిరంతర ప్రక్రియ అని, ఒంటరిగానే బలపడతాం, ఒంటరిగానే పోరాడతాం. తెలంగాణలో బీజేపీకి మంచి భవిష్యత్తు ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీజేపీ సిద్ధమే`` అని అన్నారు. అయితే అమిత్ షా ప‌ర్య‌ట‌న‌కు న‌ల్ల‌గొండ జిల్లాను ఎంచుకోవ‌డ‌మే ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ఆ జిల్లాకు చెందిన ఇద్ద‌రు కీల‌క కాంగ్రెస్ నేత‌లు క‌మ‌ళం గూటికి చేరుతార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో న‌ల్ల‌గొండ జిల్లాలో అమిత్ షా ప‌ర్య‌ట‌న ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇదిలాఉండ‌గా.. ఏపీలో బీజేపీ అధ్యక్షులు అమిత్‌ షా రాష్ట్ర పర్యటనను విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ఇన్‌ ఛార్జి - ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్యశాఖ మంత్రి సిద్ధార్థనాథ్‌ సింగ్‌ కోరారు. విజయవాడలో ఆయన ఎంపీలు - ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - పార్టీ కోర్‌ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ నెల 25న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో నిర్వహించే పార్టీ పోలింగ్‌ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశంలో అమిత్‌ షా పాల్గొంటారని చెప్పారు. దీనికి పకడ్బందీ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/