Begin typing your search above and press return to search.

కేంద్రం దృష్టిలో పడేందుకు అనిల్ అంబానీ తహతహ!!

By:  Tupaki Desk   |   13 March 2020 8:24 AM GMT
కేంద్రం దృష్టిలో పడేందుకు అనిల్ అంబానీ తహతహ!!
X
రాజకీయాలకు పారిశ్రామికవేత్తలకు పరోక్ష సంబంధాలు ఉంటాయి. రాజకీయ పార్టీలకు భారీ ఎత్తున నిధులు - విరాళాలు సమకూరుస్తుండడంతో ప్రభుత్వాలు కూడా వారికి కావాల్సిన ఏర్పాట్లు - సౌకర్యాలు కల్పిస్తుంటాయి. అయితే ఇప్పుడు రాజకీయాల్లోకి పారిశ్రామికవేత్తలు నేరుగా ప్రవేశిస్తున్నారు. ఇప్పుడు రాజకీయాల్లో కార్పొరేట్లు పెరుగుతున్నారు. ఇక బహిరంగంగా బేరసారాలు చేస్తున్నారు. తాజాగా ముఖేశ్ అంబానీ తన స్నేహితుడు పరిమల్ నత్వానీ కోసం ఏకంగా వైఎస్సార్సీపీ అధినేత - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వద్దకు వచ్చాడు. అతడి వినతి మేరకు జగన్ ఒక రాజ్యసభ సీటు కూడా ఇచ్చాడు. ఈ విధంగా బహిరంగంగా రాజకీయాల్లో కనిపిస్తున్నారు. తాజాగా అతడి సోదరుడు - దివాళా తీసిన పారిశ్రామికవేత్త రాజకీయ విమర్శలు చేయడం గమనార్హం. వారసత్వంగా వచ్చిన ఆస్తిని వివిధ వ్యాపారాల్లో పెట్టి తీవ్రంగా నష్టపోయిన అనిల్ అంబానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నాడు. ఆ పార్టీ యువ నాయకుడు రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డాడు. ఏకంగా గాంధీ కుటుంబాన్ని విమర్శిస్తూ పలు ప్రశ్నలు సంధించాడు.

అయితే రాజకీయాలకు దూరంగా ఉండాలని కార్పొరేట్లు ఎప్పుడూ భావిస్తుంటారు. అదొక కంపు.. దానిలో దిగొద్దు అని ఒక నిబంధన పెట్టుకుని తమ పని వారు చేసుకుంటూ వెళ్తుంటారు. అయితే అనిల్ అంబానీ పరిస్థితి వేరు. ఆయన కుటుంబం నుంచి వచ్చిన ఆస్తిని తన అన్న ముఖేశ్ అంబానీని కాదని ఆస్తి పంపకాలు చేసుకుని విడిపోయారు. తమ్ముడు - అన్న వేర్వేరయ్యారు. పారిశ్రామిక రంగంలో ఇద్దరు దిగ్గజాలే. ఆయన తన అన్నతో విడిపోయినప్పుడు వేల కోట్లకు అధిపతిగా ఉన్నాడు. ఇప్పుడాయన బికారీ అయ్యాడు. వ్యాపారం చేసే నైపుణ్యం - లక్షణాలు లేని వ్యక్తి అన్నింట్లో వేలు పెట్టి చివరకు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాడు. ఎస్ బ్యాంక్ సంక్షోభం ఈయన పుణ్యమే. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఎవరిపై కోపం ప్రదర్శించాలో తెలియడం లేదు. ఫ్రస్ట్రేషన్ కు అనిల్ అంబానీ గురవుతున్నాడు. ఈ క్రమంలోనే రాహూల్ గాంధీపై విమర్శలు చేశాడు. ఏకంగా పది ప్రశ్నలు వేశాడు. తన కుటుంబం పన్నులు చెల్లిస్తూ దేశ సంపద పెంచుతుంటే తమపై విమర్శలు చేయడంపై మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాహూల్ గాంధీ ముఖ్యంగా అంబానీ కుటుంబంపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. వాటిని గుర్తు పెట్టుకుని అనిల్ అంబానీ రాహూల్ ను తప్పుబట్టారు. రాహూల్ విమర్శలతోనే తన కంపెనీలు కుప్పకూలాయని ఆయన ఆందోళన చెందుతున్నారు. ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ఇలా రాజకీయ విమర్శలు చేయడం పారిశ్రామిక వర్గాల్లో హాట్ టాపికయ్యింది.

ఆ రాజకీయలంటేనే గబ్బు మళ్లీ అందులో ఎందుకు ఇన్వాల్వ్ కావాలని ప్రశ్నిస్తున్నారు. రాజకీయాలను విమర్శిస్తే ఉన్న పరువు పోతుందని తెలియదా అనిల్ అంబానీ అని కొందరు జాలీ చూపిస్తున్నారు. కష్టాల్లో కూరుకున్న అనిల్ అంబానీ ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ఈ విధంగా చేస్తున్నారని పలువురు పేర్కొంటున్నారు. అయితే కాంగ్రెస్ ను తిడితే కేంద్ర ప్రభుత్వం కరుణించి తన కష్టాలను గట్టెక్కించేలా ఓ మార్గం చూపించిందనే ఉద్దేశంతో ఈ విధంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారని రాజకీయ వర్గాలతో పాటు కార్పొరేట్లలోనూ టాక్ వినిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పడాలని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నాడని తెలుస్తోంది. ఏది ఏమున్నా ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరొలా వైఖరి మారడం సరికాదని ప్రజలు చెబుతున్నారు.