Begin typing your search above and press return to search.

అందువల్లే ‘ఆస్టేలియా’ గెలిచిందా?

By:  Tupaki Desk   |   15 Nov 2021 5:54 AM GMT
అందువల్లే ‘ఆస్టేలియా’ గెలిచిందా?
X
ఎన్నో అంచనాల మధ్య టీ20 వరల్డ్ కప్ జరిగింది. కరోనా జాగ్రత్తల మధ్య క్రికెటర్లు, అభిమానులు ప్రపంచ కప్ మ్యాచ్ ఆస్వాదించారు. హాట్ ఫేవరేట్ గా బరిలో దిగిన ఇండియా, ఇంగ్లాండ్ ఈసారి ప్రేక్షకులను నిరాశపరిచాయి. అయితే ఫైనల్ కు మాత్రం ఆస్ట్రేలియా, న్యూజిల్యాండ్ జట్లు చేరారు. ఈ రెండింటిలో ఏ జట్టు గెలిచిన ఆ దేశానికి తొలి టీ-20 వరల్డ్ కప్ దక్కనుంది. దీంతో ఈ రెండింటిలో ఏ జట్టు ట్రోఫీని కైవసం చేసుకుంటుందనే ఆసక్తి నెలకొంది.

మ్యాచ్ ముందు అంతా న్యూజిల్యాండ్ జట్టే ఫేవరేట్ గా నిలిచింది. ఈసారి కప్ ను ఆదేశమే ఎగురవేసుకుపోవడం ఖాయమనే టాక్ విన్పించింది. అయితే దుబాయ్ వేదికలో జరుగుతున్న క్రికెట్ మ్యాచుల్లో టాసే ప్రధాన భూమిక పోషిస్తూ వస్తోంది. టాస్ గెలిస్తే సగం మ్యాచ్ గెలిచినట్లేననే అభిప్రాయం తొలి మ్యాచ్ నుంచి ఉంది. ఇక ఫైనల్లోనే అదే సీన్ రిపీట్ కావడం విశేషం.

ఆస్ట్రేలియా జట్టు టాస్ గెలుచుకోవడంతో ఎలాంటి జంకు లేకుండా న్యూజిల్యాండ్ కు బ్యాటింగ్ అప్పగించింది. ఆస్ట్రేలియా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసినప్పటికీ న్యూజిల్యాండ్ 172 పరుగుల గౌరవప్రదమైన స్కోరును ఆస్ట్రేలియా ముందు ఉంచింది. కాగా దుబాయ్ లో ఛేజింగ్ చేసే జట్టుకు వాతావరణం అనుకూలంగా మారుతోంది. ఇదే అంశం ఆస్ట్రేలియా జట్టుకు కలిసి వచ్చింది.

మ్యాచ్ లో కొంత తడబడినట్లు కన్పించిన ఆస్ట్రేలియా చివరికి విజేతగా గెలిచి తొలిసారి టీ-20 వరల్డ్ కప్ ను ఎగురేసుకొని పోయింది. ఆస్ట్రేలియా జట్టు టెస్ట్, వన్డే ప్రపంచ కప్, ఛాపింయన్ ట్రోఫీలను గెలుచుకున్నప్పటికీ ఎన్నో ఏళ్లుగా టీ20 వరల్డ్ కప్ మాత్రం ఆ జట్టు అందుకోలేకపోయింది.

అయితే దుబాయ్ కండిషన్స్ తోపాటు ఆస్ట్రేలియాకు టాస్ రూపంలో అదృష్టం కలిసి రావడంతో ఆజట్టు ఎట్టకేలకు తొలి టీ20 వరల్డ్ కప్ ను తన ఖాతాలో వేసుకొంది. అయితే న్యూజిల్యాండ్ జట్టు మాత్రం ఇటీవలీ కాలంలో అద్భుతమైన ఫార్మామెన్స్ చేస్తూ ఆకట్టుకుంటోంది. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ చేరిన ఆ జట్టు అనుహ్యంగా ఓటమి పాలైంది.

ఆ తర్వాత టెస్టు ఛాంపియన్ షిష్ గెలుచుకుంది. ఇప్పుడు టీ-20 వరల్డ్ కప్ రన్నరప్ గా నిలిచింది. మొత్తానికి దుబాయ్ కండిషన్స్ ఛేజింగ్ కు బాగా అనుకూలంగా ఉంటాయని మరోసారి రుజువైంది. పరిస్థితులను అనుకూలంగా మలుచుకున్న ఆస్ట్రేలియా తమకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న టీ20 వరల్డ్ కప్ ను ఎట్టకేలకు అందించి విశ్వవిజేతగా నిలిచింది.