Begin typing your search above and press return to search.

బాడీ నుంచి బ్యాడ్ స్మెల్..కార‌ణం ఇదే!

By:  Tupaki Desk   |   5 Jun 2018 5:30 PM GMT
బాడీ నుంచి బ్యాడ్ స్మెల్..కార‌ణం ఇదే!
X
ఫెర్ ప్యూమ్‌ లు.. బాడీ స్ప్రేల‌తో అద‌ర‌గొట్టేస్తుంటారు కొంద‌రు. ఎందుకంటా? అంటే.. బాడీ నుంచి అదోలాంటి వాస‌న వ‌స్తుంది. దాన్ని అధిగ‌మించ‌టానికే ఇదంతా అంటూ కొంద‌రు స‌న్నిహితుల ద‌గ్గ‌ర అస‌లు విష‌యాన్ని చెబుతుంటారు. బాడీ నుంచి బ్యాడ్ రావ‌టానికి కార‌ణం తీసుకునే ఆహార‌మ‌న్న విష‌యం చాలా మందికి తెలీదు.

నిజానికి అంత దూరం కూడా ఆలోచించ‌రు. కానీ.. నిపుణులు చెప్పే మాట‌లు వింటే నోట మాట రాదంతే. కొంద‌రి ద‌గ్గ‌ర నుంచి బ్యాడ్ స్మెల్ వ‌స్తుంటుంది. ఇందుకు కార‌ణం వారు తినే ఆహార‌మేన‌ని చెప్పాలి. చెమ‌ట ప‌ట్టిన‌ప్పుడు శ‌రీరం నుంచి వ‌చ్చే ఈ వాస‌న‌కు కార‌ణాల్ని నిపుణులు చెబుతున్న విష‌యాలు విన్న‌ప్పుడు అర్జెంట్ గా మ‌న‌ల్ని మ‌నం మార్చుకోవాల్సిన విష‌యాలు చాలానే ఉన్నాయ‌ని అనిపించ‌క మాన‌దు.

చ‌ర్మం మీద ఉండే బ్యాక్టీరియా చెమ‌ట‌లోని ర‌సాయ‌నాల‌ను విడ‌గొడుతుంది. యుక్త వ‌య‌సులో ఉన్న‌ప్పుడు.. షుగ‌ర్ అటాక్ అయిన వారి నుంచి ఈ వాస‌న తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంది. ల‌వంగాలు.. యాలుక‌లు.. ప‌సుపు.. మెంతులు.. లాంటి మ‌సాలాలు నాలుక‌కు..ప‌ళ్ల‌కు అతుక్కుపోతాయి. దీంతో.. ఒక‌లాంటి వాస‌న వ‌స్తుంటుంది. మ‌సాలాల అవ‌శేషాలు మ‌న శ్వాస‌లోనూ.. వెంట్రుక‌ల్లో.. చ‌ర్మం మీదా గంట‌ల కొద్దీ ఉండిపోతాయి. ఉల్లిపాయి బాగా తినే వారు ఒక ఆర్నెల్లు మానేసి.. త‌ర్వాత ప‌చ్చి ఉల్లిపాయ‌ల్ని తిని చూడండి.. ఒక‌లాంటి వాస‌న గంట‌ల కొద్దీ వెంటాడి వేధించ‌టం ఖాయం.

క్యాబేజీ.. గోబీ లాంటి వాటితో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ ను విడుద‌ల చేస్తాయి. ఇది చెమ‌ట‌.. శ్వాస‌.. గ్యాస్ ను విడుద‌ల‌య్యే వేళ‌లో భ‌రించ‌లేని వాస‌న‌ను విడుద‌ల చేస్తుంటాయి. ఇక‌.. చికెన్.. మ‌ట‌న్ లాంటి వాటిని తినే వారికి మ‌రోలాంటి ఇబ్బంది ఉంటుంది. ఈ ఫుడ్ వాస‌న‌లేని ప్రోటీన్ల‌ను విడుద‌ల చేస్తాయి. శ్వాస ద్వారా వెలుప‌ల‌కు వ‌చ్చే ఈ ప్రోటీన్లు చ‌ర్మం మీద బ్యాక్టీరియాతో క‌లిసి వాస‌న మ‌రింత పెరిగేలా చేస్తాయి.

వెల్లుల్లి.. ఉల్లి లాంటివి నాలుక‌కు.. ద‌వ‌డ‌ల‌కు అతుక్కుపోయి నోటి నుంచి ఘాటు వాస‌న‌ను వెలువ‌డేలా చేస్తుంటాయి.ఈ రెండు కొంద‌రిలో జీవ‌క్రియ‌లు.. శ‌రీర ఉష్ణోగ్ర‌త‌ల్ని పెరిగేలా చేస్తాయి. ఇలాంటి వారికి చెమ‌ట‌లు ఎక్కువ‌గా ప‌డుతుంటాయి. దీంతో చ‌ర్మం మీద బ్యాక్టీరియాతో క‌లిసిపోయి ఒక‌లాంటి వాస‌న‌ను విడుద‌ల చేస్తుంటాయి. సో.. మీరు తీసుకునే ఆహారం మీ బాడీ స్మెల్ ను ప్ర‌భావితం చేస్తుంద‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.