Begin typing your search above and press return to search.
భూమా చేరిక వెనుక చిరకాల కోరిక..
By: Tupaki Desk | 23 Feb 2016 6:47 AM GMTవైసీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడం చాలామందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే... ఆయన చేరిక వెనుక చిరకాల కోరిక ఉందని.. ఆ కారణంగానే ఆయన చేరారని తెలుస్తోంది. టీడీపీలో చేరిక సందర్భంగా భూమా మాటలు వింటే ఆయన మనసులోని కోరికను ఇట్టే గ్రహించవచ్చు.
ఒకప్పుడు టీడీపీలోనే ఉన్న భూమా అనంతరం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు ఆ పార్టీలో చేరారు. అనంతరం చిరంజీవి దాన్ని కాంగ్రెస్ లో కలిపేశాక భూమా వైసీపీలో చేరారు. టీడీపీలో ఉండగా నంద్యాల పార్లమెంటు ఎన్నికల్లో పీవీ నరహింసరావుపై పోటీ చేసిన ఘనుడిగానే కాకుండా చురుకైన నేతగా ఆయన ప్రాధాన్యం ఉండేది. కానీ... భూమా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా టీడీపీ అధికారంలో లేదు. అనంతరం ఆయన ప్రజారాజ్యం నుంచి గెలిచినా ఆ పార్టీ కూడా అధికారం అందుకోలేకపోయింది. చివరకు వైసీపీలోకి వెళ్లినా అక్కడా అధికారం దక్కలేదు. అయితే.... వైసీపీలో మాత్రం మొదట్లో భూమాకు ప్రాధాన్యం దక్కింది. రాజశేఖరరెడ్డి కుటుంబానికి సమీప బంధువైన భూమాను జగన్ బాగానే చూసుకున్నారు. ప్రతిపక్ష పార్టీకి దక్కే పెద్ద పదవి పీఏసీ ఛైర్మన్ ను భూమాకే ఇచ్చారు. భూమా సతీమణి శోభా నాగిరెడ్డినైతే జగన్ అక్కా అని పిలిచేవారు. శోభానాగిరెడ్డి మరణం తరువాత ఆళ్లగడ్డ టిక్కెట్ ను భూమా కుమార్తెకు ఇచ్చి గెలిపించారు. అనంతర కాలంలో ఏం జరిగిందో ఏమో కానీ జగన్ కు భూమాకు కొంతకాలంగా దూరం పెరిగింది.
అయితే.... భూమా చాలాకాలంగా రాజకీయాల్లో ఉన్నా... కర్నూలులో ప్రభావవంతమైన నాయకుడిగా ఉన్నా కూడా మంత్రి పదవి చేపట్టలేదు. ఆ కోరిక ఆయన్ను వెంటాడుతుందని చెబుతుంటారు. ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడడం... తమ పాతన నాయకుడు చంద్రబాబు అధికారంలోకి రావడం... తనను సంప్రదించడంతో ఆయన మనసు అధికారంవైపు మళ్లింది. మంత్రి పదవి చేపట్టి ఆ ఒక్క కోరికా తీర్చుకోవడానికి ఇది సరైన తరుణంగా ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జగన్ పార్టీ కూడా రోజురోజుకూ క్షీణిస్తుందే తప్ప వచ్చే ఎన్నికల్లోనైనా అధికారం దక్కించుకుంటామన్న నమ్మకాన్ని పార్టీ నేతల్లో కల్పించలేకపోతోంది. ఈ కారణాలతోనే భూమా ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు. భూమా మాటల్లోనూ ఈ భావనే వ్యక్తమైంది. తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం ప్రతిపక్షంలోనే ఉన్నానని... ప్రతిపక్షంలో ఉండడం వల్ల తనను నమ్ముకున్న నియోజకవర్గ అభివృద్ధి పూర్తిస్థాయిలో సాధ్య పడడం లేదని.. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలో ఉన్న తాను ఇప్పుడు అధికార పక్షంలో ఉండడం ఆనందంగా ఉందన్నారు. మంత్రి పదవిపై హామీ ఏమీ తీసుకోలేదని ఆయన చెబుతున్నా ఆ విషయంలో ఆయన చంద్రబాబు నుంచి గట్టి భరోసా ఉందనే తెలుస్తోంది.