Begin typing your search above and press return to search.

బీజేపీ పతనం కాశ్మీర్ నుండే మొదలైందా..?

By:  Tupaki Desk   |   25 Oct 2019 9:21 AM GMT
బీజేపీ పతనం కాశ్మీర్ నుండే మొదలైందా..?
X
ఆర్టికల్ 370 రద్దు..బీజేపీ ప్రభుత్వం తీసుకున్న కీలకమైన నిర్ణయాలలో ఒకటి. ఈ నిర్ణయం యావత్ దేశాన్ని ఒక్కసారిగా విస్మయానికి గురిచేసింది. ఈ సంచలన నిర్ణయంతో ప్రపంచం మొత్తం భారత్ వైపు తొంగిచూసింది. పాక్ ఇప్పటికి కూడా ఆర్టికల్ 370 రద్దు పై విషం కక్కుతూనే ఉంది. కాశ్మీర్ విషయంలో సంచలనమైన నిర్ణయం తీసుకున్నాం అని చెప్తున్నా బీజేపీ పెద్దలకి అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు గట్టి షాక్ ని ఇచ్చాయి.

మొత్తం 280 స్థానాలకు అక్కడ ఎన్నికలు జరుగగా బీజేపీ 81 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. ఇక ఇండిపెండెంట్లు మెజార్టీ స్థానాల్లో విజయం సాధించారు. అలాగే గత కొన్ని రోజులుగా ఎన్సీ - పీపీడీ - కాంగ్రెస్ నేతలను గృహనిర్భంధంలో ఉంచడంతో నిరసనగా ఈ ఎన్నికలలో ఆ పార్టీలు పోటీచేయలేదు. పోటీ చేసిన పెద్ద పార్టీ ఒక్క బీజేపీ మాత్రమే.

ఇకపోతే కశ్మీర్ లోయలో బీజేపీ 137 స్థానాల్లో 18 మాత్రమే గెలువగలిగింది. జమ్మూకశ్మీర్‌ లో మొత్తం 316 బ్లాకులకు గాను 307 బ్లాకులకు మాత్రమే ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ఇక్కడ 27 మంది అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవం కావడంతో 280 బ్లాకులకు మాత్రమే ఎన్నికలు నిర్వహించారు. అలాగే జమ్మూలో 148 స్థానాలకి గాను బీజేపీ 52 స్థానాల్లో విజయం సాధించింది. 88 స్థానాలలో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు.