Begin typing your search above and press return to search.
కేజ్రీవాల్ గెలుపుకు.. బీజేపీ ఓటమికి కారణమదే?
By: Tupaki Desk | 11 Feb 2020 6:30 PM GMTదేశంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు ముందుగా చూసేది పార్టీ... ఆ పార్టీని నడిపించే బలమైన నేతనే.. తెలుగు రాష్ట్రాల్లో నాడు కాంగ్రెస్ ను గెలిపించింది వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చూసే.. ఆ తర్వాత టీడీపీని, టీఆర్ఎస్ ను గెలిపించింది బలమైన చంద్రబాబు, కేసీఆర్ లను చూసే.. ఇప్పుడు జగన్ ను కూడా అదే బలమైన లక్షణాలు చూసే గెలిపించారు..
అంతదాకా ఎందుకు.. 2014 సార్వత్రిక ఎన్నికల సమరంలో సామాన్యుడిని గెలిపించండని నరేంద్రమోడీ ఒకవైపు.. అపరిపక్వతతో రాహుల్ గాంధీ నిలబడితే అందరూ మోడీనే గెలిపించారు. ఈసారి 2019 ఎన్నికల్లో అదే రిపీట్ అయ్యింది.
పార్టీని, నడిపించే నాయకుడు తమకు ఏం మేలు చేస్తాడు.. ఎంత దగ్గరగా ఉన్నాడని మాత్రమే రాష్ట్రాల ప్రజలు చూస్తారు. దేశంలో మోడీ, రాహుల్ ను చూసినప్పుడు మోడీ బెస్ట్ అని గెలిపించారు. రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల విజయం వెనుక అదే సూత్రాన్ని ప్రజలు పాటిస్తున్నారు.
తాజాగా ఢిల్లీలో కేజ్రీవాల్ ఒకటే నినాదం పలికించారు.. ‘ఢిల్లీకీ నేను కాకపోతే ఇక ఎవరు’ అని ప్రశ్నించారు. ప్రజల్లోకి బలంగా తీసుకెల్లారు. బీజేపీ మాత్రం తమ సీఎం అభ్యర్థిని ప్రకటించలేదు. మోడీ చరిష్మాను నమ్ముకుంది. అరుణ్ జైట్లీ, సుష్మ మరణంతో ఢిల్లీలో బలమైన నేత లేకుండా పోయారు. ఇక కాంగ్రెస్ కు షీలా దీక్షిత్ మరణంతో అసలు మరో నేత కరువయ్యారు.
బీజేపీ తరుఫున మనోజ్ తివారీ, గౌతం గంభీర్ ఉన్నప్పటికీ వారు కేజ్రీవాల్ స్థాయికి సరితూగే వారు లేదు.కాంగ్రెస్ లో కనీసం ఆ స్థాయి నేతలు కూడా లేరు..
అందుకే ప్రజలు లోకల్ చంటిగాడు.. బలమైన నేత అయిన కేజ్రీవాల్ ను గెలిపించారని ఢిల్లీ ఓటరు నాడి చూస్తే తేటతెల్లమవుతోంది. విశ్లేషకులు ఇదే విషయం స్పష్టం చేస్తున్నారు.