Begin typing your search above and press return to search.
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ క్యాన్సిల్ అయ్యింది ఎందుకు?
By: Tupaki Desk | 28 Oct 2022 4:04 AM GMTతమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేల్ని ఎర వేసిన బీజేపీ మధ్యవర్తుల వ్యవహారాన్ని బట్టబయలు చేసినట్లుగా చెబుతున్న ఫాంహౌస్ ఎపిసోడ్ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయంగా పెను సంచలనంగా మారటం తెలిసిందే. ఈ ఉదంతంతో బీజేపీ దూకుడుకు బ్రేకులు వేయటంతో పాటు.. వారిని ఆత్మరక్షణలో పడేయటంలో విజయం సాధించినట్లుగా గులాబీ నేతలు చెప్పుకుంటున్నారు. దీనికి భిన్నంగా.. కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మొయినాబాద్ ఫాంహౌస్ ఎపిసోడ్ ఉన్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.
ఒక్కో ఎమ్మెల్యేకు రూ.వంద కోట్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిన ఉదంతంలో.. అసలు డబ్బే లేని వైనం ఈ మొత్తం ఎపిసోడ్ ను తుస్సుమనిపించేలా చేసిందన్న మాట పలువురి నోట వస్తోంది. అయితే.. డబ్బుల ఎపిసోడ్ లేనప్పటికీ.. అంతకు మించిన ఆడియో.. వీడియో టేపులు లభించాయని.. నాలుగు గంటల విలువైన సీక్రెట్ కెమేరాల ఫుటేజ్ తో కమలనాథులు అడ్డంగా బుక్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇలాంటివేళ.. గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళలో ప్రెస్ మీట్ ఉంటుందన్న ప్రచారం జరిగింది.
అయితే.. ఈ ప్రెస్ మీట్ వాయిదా పడటంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ప్రెస్ మీట్ తో మొయినాబాద్ పాంహౌస్ ఎపిసోడ్ తర్వాతి లెవల్ కు వెళుతుందని ఆశించిన వారంతా నిరాశకు గురయ్యేలా చేయటం తెలిసిందే. ఇంతకూ సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ఎందుకు వాయిదా పడింది? దానికి కారణం ఏమిటి? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే.. ఆసక్తికర విషయాల్ని చెబుతున్నారు.
ముందుగా అనుకున్న దాని ప్రకారం గురువారం మధ్యాహ్నం 2 గంటల వేళలో.. ప్రగతిభవన్ లో ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి.. తమ ఎమ్మెల్యేల్ని ఎర వేసిన బీజేపీ దరిద్రపుగొట్టు ప్లానింగ్ పై కేసీఆర్ నిప్పులు చెరగాలని భావించారు.
అయితే.. జాతీయ పార్టీని పెట్టి.. జాతీయస్థాయిలో బీజేపీని దెబ్బ తీసే అరుదైన అవకాశం లభించిన వేళ.. దేశ రాజధానిలో ప్రెస్ మీట్ పెట్టకుండా.. హైదరాబాద్ లో పెట్టటంతో ఆశించినంత పొలిటికల్ మైలేజీ ఉండదన్న వాదనను ముఖ్యమంత్రి కేసీఆర్ వరకు తీసుకెళ్లటం.. ఈ వాదనపై మొదట్లో సానుకూలంగా లేనప్పటికీ.. తర్వాత మాత్రం ఆ వాదన వైపే మొగ్గినట్లుగా సమాచారం.
ఈ కారణంతోనే గురువారం మధ్యాహ్నం రెండు గంటల వేళలో జరగాల్సిన ప్రెస్ మీట్ ను వాయిదా వేసినట్లుగా తెలుస్తోంది. అదే సమయంలో అప్పటివరకు షెడ్యూల్ కాని ఢిల్లీ టూర్ పైనా వార్తలు రావటం మొదలైంది. మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండేందుకు వీలుగా.. సీఎం కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. తాజా పరిణామాల్ని చూస్తే.. దేశ రాజధానిలో బీజేపీ బండారాన్ని బట్టబయలు చేసేందుకు కేసీఆర్ ప్లానింగ్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ వస్తుందని చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.