Begin typing your search above and press return to search.

'ఫాస్టాగ్' వెనుక కేంద్రం దాచిన బ్రహ్మాస్త్రం ఇదే..

By:  Tupaki Desk   |   18 Dec 2019 8:07 AM GMT
ఫాస్టాగ్ వెనుక కేంద్రం దాచిన బ్రహ్మాస్త్రం ఇదే..
X
దేశమంతా పౌరసత్వ సవరణ చట్టం మంటలు అంటుకుంటున్న వేళ కేంద్రంలోని బీజేపీ సర్కారు గుట్టుచప్పుడు కాకుండా చల్లాగా ‘ఫాస్టాగ్’ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారులపై పెరిగిపోతున్న ట్రాఫిక్ ను అరికట్టడానికి.. టోల్ గేట్ ల వద్ద ఆగకుండా వెళ్లడానికి ఈ ఫాస్టాగ్ తెచ్చామని అంటోంది. దీని వల్ల ప్రయాణికులు టోల్ గేట్ వద్ద గంటల తరబడి వేచి ఉండకుండా చేయవచ్చని దీన్ని తెచ్చామంటోంది. అయితే దీనివెనుక పెద్ద స్కెచ్చే ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.

ఫాస్టాగ్ కోసం ప్రతీ వాహనం అద్దెపై ఒక కోడ్ తో ముద్రించిన స్టిక్కర్ ముద్రిస్తారు. తద్వారా ఆ వాహనం ఎక్కడికి వెళ్లినా కోడ్ ఆధారంగా ఏం చేసినా దానిపై నిఘా ఉంచడానికి కేంద్రానికి వీలు చిక్కతుందట.. ఫాస్టాగ్ వల్ల స్మగ్లర్ల కదలికలను సులభంగా ట్రాక్ చేయవచ్చట.. అలాగే అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేయవచ్చు. హింస - మోసాలకు పాల్పడిన వారు - నేరస్థులు - దొంగలు వాహనాల నంబర్ ప్లేట్ - కార్ల రంగును మార్చినా కూడా ఫాస్టాగ్ ఒకటే ఉంటుంది కాబట్టి ఆ వాహనాన్ని ఈజీగా పోలీసులు గుర్తించడానికి దోహదపడుతుంది. తప్పించుకోవడానికి వీల్లేకుండా ఫాస్టాగ్ మార్చబడదు. ఇది పోలీసులకు వాహనాలను ట్రాక్ చేయడానికి.. నేరస్థులను పట్టుకోవడానికి వీలు కల్పిస్తుంది.

అలాగే, వాహనాల కోసం నకిలీ బీమా క్లెయిమ్‌ లు కూడా తొలగించబడతాయి. ఫాస్టాగ్ రికార్డింగ్‌ ల ప్రకారం వాహనం వెళ్ళిన ప్రదేశాలను సులభంగా గుర్తించవచ్చు. దాన్ని ట్రాక్ చేయడంలో సహాయపడతాయి.

చందనం అక్రమ రవాణా ప్రబలంగా ఉన్న తమిళనాడులో ఫాస్టాగ్ వల్ల చాలా మేలు జరుగుతోంది. తమిళనాడులోని శివగంగలో పోలీసులు అక్రమ రవాణాకు పాల్పడిన అనుమానాస్పద వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లను ఇచ్చారు. ఈ వాహనాలను గుర్తించడానికి జాతీయ రహదారి అధికారుల సహాయం తీసుకుంటున్నారు. ఇక బీమా చెల్లింపుల ఎగవేత కూడా ఫాస్టాగ్ తో పట్టుకోవచ్చని అధికారులు అంటున్నారు.

ఇలా ఫాస్టాగ్ తో ట్రాఫిక్ సమస్యలకే కాదు.. నేరస్థులు - స్మగ్లర్ల ఆటకట్టించడం.. బీమా కట్టించుకోవడం.. మోసాలు అరికట్టడం ద్వారా అన్ని పనులు ఒకేసారి చేయవచ్చని కేంద్రం ఈ బ్రహ్మాస్త్రాన్ని తెచ్చినట్టు సమాచారం.