Begin typing your search above and press return to search.
బాబు ఓడిపోవడానికి కారణం అదేనట..
By: Tupaki Desk | 20 May 2019 8:16 AM GMTఎవరి నమ్మకాలు వారివి.. ఎవరి సిద్ధాంతాలు వారివి. 2014లో తెలంగాణలో అధికారం చేపట్టిన కేసీఆర్ వాస్తు సరిగా లేదని తెలంగాణ సెక్రెటేరియట్ లోనే అడుగు పెట్టడం లేదు. అక్కడికి వెళితే మంచిది కాదని.. ఓడిపోతామని పండితులు చెప్పడంతో తన ఇంటినే సెక్రెటేరియట్ కేంద్రంగా మలిచి అన్ని సమీక్షలను ప్రగతి భవన్ లోనే కానిచ్చేస్తున్నారు. రెండో దఫా కూడా అధికారం చేపట్టినా తెలంగాణ సెక్రెటేరియట్ వైపు అడుగులు వేయడం లేదు. ఇక ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి నివాసమైన బేగంపేటలోని ఇంటిని వదిలేసిన సొంతంగా ‘ప్రగతి భవన్ ను’ మంచి వాస్తుతో కట్టించి అందులోనే ఉంటున్నారు..ఇది వాస్తుపై కేసీఆర్ పై గల గట్టి నమ్మకం.
కేసీఆర్ గెలుపు కోసం యజ్ఞాలు, యాగాలు, వాస్తు మార్పులు చేస్తుంటారు. అవి ఆయన విషయంలో సానుకూల ఫలితాలు ఇచ్చాయి. అయితే ఏపీ సీఎం చంద్రబాబుకు మాత్రం ఈ నమ్మకాలు చాలా తక్కువ. ఆయన హైటెక్ బాబు.. వాస్తును, యాగాలు, యజ్ఞాలను అంతగా పట్టించుకోరు.. అదే ఆయన కొంప ముంచిందని ప్రముఖ జ్యోతిష్య పండితుడు బల్లగుద్దీ చెబుతున్నాడు.
చంద్రబాబు హైటెక్ భవనాలు నిర్మించడంలో దిట్ట. కానీ అందులో వాస్తును, గట్రా నమ్మకాలు పట్టించుకోరు. అలానే అమరావతిలో సెక్రెటేరియట్, అసెంబ్లీ, ఇతర భవనాలు కడుతున్నారు. అయితే చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ లో ఓడిపోతాడని ఫలితాలు రావడంతో కొత్త వాదన తెరపైకి వచ్చింది.
ప్రముఖ వాస్తు సిద్ధాంతి అయిన గోటూరి పాములు సోమవారం విజయవాడలో చేసిన సంచలన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ఏపీ రాజధాని అమరావతితో నిర్మించిన ప్రభుత్వ కార్యాలయాలు, సెక్రెటేరియట్ నిర్మాణంలో వాస్తు దోషం చాలా ఉందని అందుకే బాబు ఓడిపోతున్నాడని చెప్పుకొచ్చాడు. ఇలాంటి వాస్తు దోషం ఉంటే ఒక సారి ముఖ్యమంత్రి అయినా వారు కష్టాలు పడుతారని.. చివరకు ఓడిపోతారని చెప్పుకొచ్చారు.
సెక్రెటేరియట్ లో తూర్పు మూతపడిపోయిందని.. ఈశాన్య గేట్ తప్ప సెక్రెటేరియట్ వాస్తు సరిగా లేదన్నారు. రూట్ చివరకు వరకూ కట్టడం కూడా వాస్తుకు విరుద్ధమన్నారు. ఎవరు ముఖ్యమంత్రి అయినా రెండోసారి గెలవరని.. ఉన్నన్నాళ్లు నష్టం చేకూరుతుందని హెచ్చరించారు.
అయితే ఈ సిద్ధాంతి చెబుతున్న మాటలను నేతలు నమ్ముతారా లేదా అన్నది వారి విజ్ఞతపై ఆధారపడి ఉంటుంది. ప్రజాతీర్పును ఎవరూ కాదనలేరు. కానీ ఓడిపోయాక ఇలాంటి ఎన్నో కారణాలు వెలుగులోకి వస్తాయి. నమ్మితే నిరాశ.. నమ్మకపోతే ధైర్యం.. అయినా వాస్తు దోషానికి.. చంద్రబాబు ఓటమికి ముడిపెట్టడంపై భిన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి.