Begin typing your search above and press return to search.
రామోజీతో విబేధాలను పరిష్కరించుకోవడానికే బాబు వెళ్లారా?
By: Tupaki Desk | 16 May 2019 6:35 AM GMTతను కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిని అంటూ రామోజీరావు కోర్టుకే చెప్పాడు. మార్గదర్శి కేసుల వ్యవహారం అప్పుడు రామోజీరావు తనలోని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకతను కోర్టుకే వివరించారు. ఆయన సొంత మీడియా వర్గం తీరును గమనించినా ఈ విషయమే స్పష్టం అవుతుంది. రామోజీరావు మొదటి నుంచి కాంగ్రెస్ వ్యతిరేకతతోనే తన మీడియా సంస్థలను నడుపుతున్నారనేది ఒక అభిప్రాయం.
అయితే కొన్ని దశల్లో మాత్రం సఖ్యత కనిపించింది. తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ప్రధాన శత్రువు కాంగ్రెస్ పార్టీ కాదు, అందుకే చంద్రబాబు నాయుడు తీరులో మార్పు వచ్చింది. అయితే రామోజీ తీరులో మాత్రం మరీ అంత మార్పు రాలేదని టాక్!
బీజేపీకి దూరమై చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి దగ్గర కావడం రామోజీరావుకు అంత నచ్చలేని టాక్. ఈ నేపథ్యంలో వీరి మధ్యన విబేధాలు కూడా పొడ సూపాయని అంటారు. గత కొన్ని రోజులుగా వీరి మధ్యన దూరం పెరిగిందట. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారాలన్నింటినీ పరిష్కరించుకునేందుకే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తనే వెళ్లి రామోజీ రావును కలిసినట్టుగా తెలుస్తోంది.
తను కాంగ్రెస్ తో కలిసి సాగుతున్న పరిస్థితులను చంద్రబాబు నాయుడు వివరించుకున్నట్టుగా సమాచారం. రేపు కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారం చేపట్టి, మోడీ ప్రధానమంత్రి అయితే అప్పుడు రామోజీ ద్వారా వ్యవహారాలను సెటిల్ చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారట చంద్రబాబు నాయుడు.
ఇప్పుడు చంద్రబాబు కాంగ్రెస్ తో జట్టు కట్టారు, కేంద్రంలో మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే.. అప్పుడు చంద్రబాబు నాయుడు మరింత ఇరకాటంలో పడిపోతారు. అందుకే రామోజీ ద్వారా మోడీతో సన్నిహిత సంబంధాలు నెరిపేందుకు చంద్రబాబు నాయుడు ఈ సమావేశాన్ని వాడుకున్నారని భోగట్టా. మరి చంద్రబాబు నాయుడును తన గురువు ఏ మేరకు కాపాడుకుంటారో!